Niharikaతో విడాకుల తర్వాత Chaitanya న్యూ పోస్ట్.. నీ జీవితం బాగుపడింది అంటున్న నెటిజన్లు

by Disha Web Desk 7 |
Niharikaతో విడాకుల తర్వాత Chaitanya న్యూ పోస్ట్.. నీ జీవితం బాగుపడింది అంటున్న నెటిజన్లు
X

దిశ, వెబ్‌డెస్క్: చైతన్య జొన్నలగడ్డ, మెగా డాటర్ నిహారిక విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. చాలా రోజులు నుంచి వీరు విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకు తాజాగా క్లారిటీ ఇచ్చారు. మేము ఇద్దరం విడాకులు తీసుకుంటున్నామంటూ అఫిసియల్‌గా అనౌన్స్ చేశారు. ఇక విడాకుల అనంతరం ఎవరి లైఫ్ వారు ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా చైతన్య చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. అది ఏంటంటే..

ఈ రోజు ఆయన 33వ పుట్టినరోజు. ఈ సందర్భంగా చైతన్య తను వెకేషన్‌ ట్రిప్‌లో ఉన్న ఫొటోని పంచుకుంటూ.. ‘‘ఆల్ త్రీస్ ఇన్ స్టయిల్’’ అని క్యాప్షన్ ఇచ్చి తనకు 33 ఏళ్లు వచ్చినట్లు యాష్ ట్యాగ్ ఇచ్చి మరి తెలిపాడు. అయితే.. ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ‘‘నిహారికతో విడిపోయి మంచి పని చేశావ్.. ఫ్రీడమ్ వచ్చిన పక్షిలా తిరుగుతున్నావా బ్రో’’ అని కొందరు కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు మాత్రం ‘‘నీ జీవితం బాగుపడింది’’ అంటూ స్పందిస్తున్నారు.

Read Also..

భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలంటే.. ఈ సూత్రాలు పాటించాల్సిందే

వర్షాకాలంలో ఆకుకూరలు తింటే ఏం జరుగుతుందో తెలుసా.. నిపుణులు ఏం అంటున్నారంటే..



Next Story

Most Viewed