భార్యాభర్తలు విడిపోకుండా ఉండాలంటే.. ఈ సూత్రాలు పాటించాల్సిందే
పెళ్లైన కొత్తలో ఎంతో సంతోషంగా ఉంటున్నప్పటికీ కొన్నాళ్లకు భార్యాభర్తల మధ్య అపోహాలు స్టార్ట్ అవుతాయి.
కొంత మంది పిల్లలు ఉన్నారని ఆలోచించి ఇష్టం లేకపోయిన కలిసి ఉంటారు. మరుకొందరు మాత్రం తెగించి విడిపోతారు.
అలా విడిపోకుండా భార్యాభర్తలు అన్యోన్యంగా కలిసిమెలసి ఉండాలంటే ఈ సూత్రాలు పాటించాల్సిందే.
చాలా వరకు బంధాలలో అపోహలు మొదలయ్యేది అనుమానం అనే పదం దగ్గర. భాగస్వామి మనసులో సందేహం అనేది వచ్చిందంటే ఇంట్లో గొడవలకు దారితీస్తాయి. కాబట్టి ఒకరిపై మరొకరి పూర్తి అవగాహన ఉండాలి.
భార్యకైన, భర్తకైన ఎదుటి వ్యక్తులతో పోల్చితే నచ్చదు. నువ్వు వారిల ఉండవు, వారిల సంపాదించవు ఇలాంటి పదాలు భాగస్వామిని మానసికంగా కృంగదీస్తుంది. కాబట్టి మీ భాగస్వామిని ఎదుటి వారితో పోల్చడం మానుకుంటే మంచిది.
మీ భాగస్వాములను వీలైనంత ఎక్కువగా ప్రేమించండి. మీ ప్రేమలో వారు సంతోషంగా ఉండేలా చూసుకోండి. అంతే కానీ.. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావు.. నేను నిన్ను ఇంత ప్రేమిస్తున్న అంటూ కొలతలు వేసుకోకూడదు. ప్రేమను మాటాల్లో కాకుండా చేతల్లో చూపించాలి.
ముఖ్యంగా ఎక్స్ పెక్టేషన్స్ వద్దు. ప్రస్తుత కాలంలో మనం ఎవరినైనా ప్రేమిస్తున్నామంటే వారి నుంచి ఏదో ఆశిస్తుంటాము. ఆశించినది జరగకపోతే మనస్పర్థలు ఎక్కువై గొడవలకు దారి తీస్తాయి.
కొంత మందికి ప్రేమని వ్యక్త పరచడం రాదు. దీంతో తమ భాగస్వామికి తనపై ప్రేమ లేదు అనుకుంటారు. కానీ, వాళ్లు మాటల్లో చెప్పలేని ప్రేమ ఏదో ఒక రూపంలో మీకు కనిపిస్తుంది. అలా మీ భాగస్వామిని అర్థం చేసుకుని సంతోషకరమైన జీవితాన్ని పొందొచ్చు.