ఏ సహాయం కావాలన్నా కాల్ చెయ్యండి.. ఫోన్ నెంబర్ షేర్ చేసిన రష్మి

by Disha Web Desk 7 |
ఏ సహాయం కావాలన్నా కాల్ చెయ్యండి.. ఫోన్ నెంబర్ షేర్ చేసిన రష్మి
X

దిశ, వెబ్‌డెస్క్: మూగ జీవాలను కాపాడేవారిలో యాంకర్ రష్మీ ముందు ఉంటారు. జంతువుల బాధను తన బాధగా ఫీలవుతూ వాటికి హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తుంటుంది. అంతేకాకుండా ఎక్కడైనా రోడ్డు పక్కన పడి ఉన్న పెట్స్‌కి తిండి పెడుతుంది, అలాగే మూగజీవాలకు గాయాలు అయితే వాటిని రక్షించే ప్రయత్నం చేస్తుంది. ఇక కరోనా టైంలో కూడా రోడ్డు మీద ఉన్న కుక్కలకి ఎంతోగానో హెల్ప్ చేసింది. ఇలా పెట్స్‌ని కాపాడే క్రమంలో కొన్ని సార్లు ట్రోల్స్‌కు కూడా గురవుతుంటుంది. కానీ అవేవి పట్టించుకోకుండా మూగజీవాల విషయంలో తన గొంతు వినిపిస్తూనే ఉంటుంది రష్మి.

ఈ క్రమంలోనే మరోసారి పెట్స్ విషయంలో ఆందోళన చెందింది రష్మి. ఈ మేరకు ‘‘అసలే వర్షాలు కుండపోతగా కురుస్తుండడంతో వరదలు బాగా ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి టైంలో ప్రభుత్వాలు జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంటారు. కానీ నోరులేని మూగజీవాలను ఎవరూ పట్టించుకోరు. వాటి ప్రాణాలను ఎవరు లెక్క చేయరు. ఇలాంటి వరదల సమయంలో మీరు బయటకు వెళ్లేటప్పడు వాటిని కట్టేసి ఉంచకుండా.. ఫ్రీగా వదిలేయండి. ఎందుకంటే ఒకవేళ వరద వస్తే అవి తప్పించుకునేందుకు వీలుగా ఉంటుంది. మూగ జంతువులను కాపాడండి. ఆవులు, గేదెలు, మేకలు, కుక్కలు, కోళ్లు ఇలా మూగజీవాల విషయంలో మీకు ఎలాంటి సలహాలు, సాయం కావాలన్నా రెస్క్యూ టీం అందుబాటులో ఉంటుంది. దానికి సంబంధించిన నెంబర్‌ను ఈ కింది చూపిస్తున్నాను అంటూ’’ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరి షేర్ చేసింది రష్మీ.



Read More..

రాత్రికి రమ్మంటూ రష్మీ‌తో అసభ్యంగా ప్రవర్తించిన కమెడియన్.. ఇంద్రజ ఏం చేసిందంటే..

Next Story

Most Viewed