- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాత్రికి రమ్మంటూ రష్మీతో అసభ్యంగా ప్రవర్తించిన కమెడియన్.. ఇంద్రజ ఏం చేసిందంటే..
టెలివిజన్ కార్యక్రమాల యాంకర్ రష్మి చేతినిండా వివిధ షోలతో దూసుకుపోతోంది. అందులో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. ప్రతీ ఆదివారం ప్రసారం అవుతున్న ఈ ప్రోగ్రామ్‌తో ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వస్తున్నారు.

దిశ, సినిమా: టెలివిజన్ కార్యక్రమాల యాంకర్ రష్మి చేతినిండా వివిధ షోలతో దూసుకుపోతోంది. అందులో ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ ఒకటి. ప్రతీ ఆదివారం ప్రసారం అవుతున్న ఈ ప్రోగ్రామ్‌తో ఎంతో మంది టాలెంటెడ్ ఆర్టిస్టులు వెలుగులోకి వస్తున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లోని యువతీ, యువకులు, పెద్ద వాళ్ళు కూడా ఈ వేదికపై తమ సత్తా చాటుతున్నారు. కాగా నెక్ట్స్ సండే ప్రసారం కాబోతున్న షోకి సంబంధించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. అయితే ఇందులో ఊహించని సంఘటన ఒకటి చోటు చేసుకుంది. అదేంటంటే.. కమెడియన్స్ అంతా డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ సందర్భంగా ఆటో రాంప్రసాద్ కూడా డబుల్ మీనింగ్ డైలాగ్‌తో రెచ్చిపోతూ రష్మీని రాత్రికి రమ్మని అడుగుతాడు. దానికామె ఎందుకు పిలిచారంటూ అడుగుతుంది. అప్పుడు రాంప్రసాద్ స్పందిస్తూ ‘నైట్ టైమ్ ఎందుకు పిలుస్తారో తెలీదా?’ అంటూ నోరు జారాడు. ఇంతలోనే పక్కనే ప్రోగ్రామ్ జడ్జ్ ఇంద్రజ ‘ఏయ్’ అంటూ వార్నింగ్ ఇస్తుంది.






