గర్భవతిగా ఉండటం అనుకున్నంత సులభం కాదు.. Bipasha Basu

by Mallepaka Hamsa |   (  Updated:2023-03-24 17:57:02  IST  )

బోల్డ్ బ్యూటీ Bipasha Basu గర్భం దాల్చిన మొదటి రోజుల్ని తలచుకుని భావోద్వేగానికి లోనైంది. ..Latest Telugu News

గర్భవతిగా ఉండటం అనుకున్నంత సులభం కాదు.. Bipasha Basu
X

దిశ, సినిమా : బోల్డ్ బ్యూటీ బిపాసా బసు గర్భం దాల్చిన మొదటి రోజుల్ని తలచుకుని భావోద్వేగానికి లోనైంది. ప్రెగ్నెంట్ కన్‌ఫర్మ్ అయిన రోజు తీవ్ర అనారోగ్యంతో ఉన్నానన్న ఆమె.. బిడ్డ కడుపులో పడిందని తెలిసి టెన్షన్‌కు గురయ్యానని, నెలలోనే ఊహించని స్థాయిలో బరువు తగ్గినట్లు తెలిపింది. ఇక తమ బేబి రాక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నామన్న నటి.. 'నేను మంచం మీద లేవలేని స్థితిలో ఉన్నా. ఏమీ తినలేకపోయా. దీంతో బరువు కోల్పోయాను. కొన్ని నెలలు భయంకరమైన పరిస్థితి అనుభవించాకే కోలుకున్నా. అయితే నాకు ఏ విషయంలోనూ తీవ్రమైన కోరికలు లేవు. తినే పదార్థాలన్నీ చిన్నచిన్నగా కాస్త ఉప్పగా ఉండాలని కోరుకున్నా. తీపిని అస్సలే ముట్టుకోలేదు. గర్భం దాల్చిన తర్వాత ఊహించని మార్పులేమీ లేనప్పటికీ చాలా సవాళ్లున్నాయి. ముందు అనుకున్నదానికంటే కష్టంగా ఉంది. అందుకే ఓవర్ యాక్టివ్‌గా ఉండటానికి బదులు ప్రస్తుతం పడుకుని విశ్రాంతి తీసుకోవడం, పాదాలను పైకి లేపడంలాంటివి చేస్తున్నా' అని వివరించింది.

ఇవి కూడా చదవండి : అత్త కూల్.. మామ ఎమోషనల్: దీపిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

వైట్ టా‌ప్‌లో కాక రేపిన రాధిక.. నెటిజన్ల సెక్సీ కామెంట్స్

Next Story