అత్త కూల్.. మామ ఎమోషనల్: దీపిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్

by Hamsa |
అత్త కూల్.. మామ ఎమోషనల్: దీపిక ఇంట్రెస్టింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ హీరోయిన్ దీపికా పదుకొణే భర్త రణ్‌వీర్ సింగ్ ఫ్యామిలీతో తనకున్న అనుబంధం గురించి ఓపెన్ అయింది. షారుఖ్ ఖాన్‌తో కలిసి నటించి అప్ కమింగ్ మూవీ 'పఠాన్‌' ప్రమోషన్స్ మొదలుపెట్టిన ఆమె తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకుంది. పెళ్లైన తర్వాత పని, పర్సనల్ లైఫ్, ఫ్యామిలీని మెయింటెన్ చేయడం ఎవరికైనా కష్టంగానే ఉంటుందన్న ఆమె.. అత్త, మామ తనను సొంత కూతురిలా చూస్తారని చెప్పింది. అంతేకాదు రణ్‌వీర్ తల్లి కొన్నిసార్లు ఫ్రెండ్ మాదిరిగా చాలా విషయాలు డిస్కస్ చేస్తుందని, అతనికి తల్లిగా కంటే తనకు స్నేహితురాలిగానే ఎక్కువ క్లోజ్‌గా ఉంటూ లోతైన చీకటి రహస్యాలను కూడా చెప్పగలిగేంత స్వేచ్ఛను ఇచ్చిందని తెలిపింది. అయితే వారితో ఏర్పడిన బంధాన్ని పదాలలో చెప్పలేనన్న దీపిక.. అత్తమ్మ చాలా కూల్‌గా ఉంటే.. మామ మాత్రం ఎమోషనల్‌గా ఉంటారని వెల్లడించింది. చివరగా వారిద్దరూ తనకు తల్లిదండ్రుల లాంటి వారని, ఒక సంపూర్ణమైన కుటుంబంలో సంతోషంగా ఉంటున్నట్లు చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి : వరుస సినిమాలు చేయకపోవడానికి కారణం అదే.. Hrithik రోషన్

ఇవి కూడా చదవండి : గర్భవతిగా ఉండటం అనుకున్నంత సులభం కాదు.. Bipasha Basu

Next Story

Most Viewed