వరుస సినిమాలు చేయకపోవడానికి కారణం అదే.. Hrithik Roshan

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-27 08:54:15  IST  )

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన 'విక్రమ్ వేద' సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది..Latest Telugu News

వరుస సినిమాలు చేయకపోవడానికి కారణం అదే.. Hrithik Roshan
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ఏడాదికి నాలుగైదు సినిమాలు చేయకపోవడానికి బలమైన కారణాలు ఉన్నాయంటున్నాడు. ప్రస్తుతం ఆయన నటించిన 'విక్రమ్ వేద' సెప్టెంబర్ 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో వేగం పెంచిన హీరో రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..'విక్రమ్ వేద' రిలీజ్ కోసం అన్ని సిద్ధం అయినట్లు తెలిపాడు. అలాగే సైఫ్ అలీ ఖాన్, రోహిత్ సరాఫ్ కీలక పాత్రల్లో నటించిన తన సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందన్న ఆయన మూవీ నిర్మాతలను 'బెస్ట్ మైండ్స్'గా పేర్కొంటూ ప్రశంసలు కురిపించాడు. ఇక వరుస సినిమాలు చేయకపోవడానికి సరైన కంటెంట్ దొరకలేదన్న హృతిక్.. ప్రతీ స్క్రిప్ట్ తన మనస్సుపై ఎంత ప్రభావం చూపిస్తుందనే దానిపైనే ఆధారపడి ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తానని వెల్లడించాడు. పుష్కర్ గాయత్రి రచన, దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను.. ఫ్రైడే ఫిల్మ్‌ వర్క్స్, జియో స్టూడియోస్, YNOT స్టూడియోస్ ప్రొడక్షన్‌, T-సిరీస్ బ్యానర్‌, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంయుక్తంగా నిర్మించారు.

ఇవి కూడా చదవండి : The Adipurush Update We Expect Teaser Of Prabhas Film On. October 2

Next Story