- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bigg Boss-9: హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సీరియల్ బ్యూటీ.. బాబోయ్ అస్సలు వద్దంటున్న నెటిజన్లు
అక్కినేని నాగార్జున్(Akkineni Nagarjuna)హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది.

దిశ, సినిమా: అక్కినేని నాగార్జున్(Akkineni Nagarjuna)హోస్ట్‌గా వ్యవహరిస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్ 9 అట్టహాసంగా ప్రారంభమైంది. ఇక ఈ సారి 9 మంది సెలబ్రిటీలు.. ఆరుగురు కామనర్స్ ఇంట్లోకి వెళ్లిన విషయం తెలిసిందే. అప్పుడే గేమ్ స్టార్ట్ చేసిన బిగ్‌బాస్ కామనర్స్‌కు బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ సెలబ్రిటీలకు చుక్కలు చూపిస్తున్నాడు. వెరైటీ టాస్కులతో జనాల్లో ఆసక్తిని కలిగిస్తున్నాడు. ఇక ఈరోజు ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ సామాన్యులకు మంచి అవకాశం ఇచ్చాడు. హీరోయిన్ సంజనాను నామినేట్ చేయడంతో పాటు అంతా ఆమెను టార్గెట్ చేయడం గమనార్హం.
గత సీజన్ మాదిరిగా.. ఈ షోలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉండనుందన్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్ సీజన్-9(Bigg Boss Season-9)లో వారం కూడా పూర్తి కాకముందే.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చే సెలబ్రిటీల పేర్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. బ్రహ్మముడి సీరియల్ నటి దీపిక రంగరాజ్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు టాక్. గత సీజన్‌లో లాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎంటర్‌టైన్‌మెంట్ డబుల్ చేసినట్లుగా ఈ అమ్మడు కూడా అలరించబోతున్నట్లు టాక్. సీరియల్స్, పలు షోస్‌లో పాల్గొన్న దీపిక తన పంచ్ డైలాగ్స్, అల్లరితనంతో ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. గత సీజన్‌లో గెస్ట్‌గా వచ్చిన ఆమె ఈ సారి కంటెస్టెంట్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు అస్సలు వద్దు ఆమె ఓవరాక్షన్ తట్టుకోలేమని అంటున్నారు.
Read More..
Bigg Boss-9: సామాన్యులకు బంపర్ ఆఫర్.. సెలబ్రిటీలకు ఇక చుక్కలే.. షాకింగ్ ట్విస్ట్‌తో అంతా షాక్






