- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bigg Boss-9: ప్రభాస్ మరదలికి బిగ్ ట్విస్ట్ ఇచ్చిన సామాన్యులు.. ఇంటి నుంచి బయటకు రానుందా?
సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ షో సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్ అయిన విషయం తెలిసిందే.

దిశ, సినిమా: సినీ ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ షో సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. ఇది వరకే 8 సీజన్లు పూర్తి కాగా.. 9వ సీజన్ ఊహించని మార్పులతో సరికొత్తగా వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సారి చదరంగం కాదు రణరంగమే అన్నట్లుగా 9మంది సెలబ్రిటీలు హౌస్‌లోకి వెళ్లగా.. 6 మంది సామాన్యులుకు ఇంట్లోకి వెళ్లే అవకాశం లభించింది. మొత్తం 15 మందితో ఈ సారి షో మరింత కొత్తగా ఉండబోతున్నట్లు ఇప్పటికే నాగార్జున ప్రకటించిన విషయం తెలిసిందే.
అంతేకాకుండా లక్జరీ హౌస్‌లో సామాన్యులు ఉండాలని.. అవుట్ హౌస్‌లో ఏమీ సదుపాయాలు లేకుండా ఉండాలని చెప్పి అందరికీ షాకిచ్చారు. సెలబ్రిటీలతో పనులు చేయించడమే కాక.. ప్రధాన హౌస్‌లోకి వెళ్లకూడదని ఆజ్ఞాపించాడు. ఇక ఈ షో స్టార్ట్ అయిన రెండో రోజే ఎలిమినేషన్స్ జరగడంతో షోలో హీట్ పుట్టించేశారు. ఈక్రమంలోనే.. తాజాగా, బిగ్‌బాస్-9 (Bigg Boss-9)నేటి ఎపిసోడ్‌లో అందరికీ షాకిచ్చారు. సామాన్యులకు ఓ బంపర్ ఆఫర్ ఇచ్చి.. సెలబ్రిటీలను కంగుతినేలా చేశారు.
అసలు ఏం జరిగిందంటే.. కామనర్స్ అందరూ కలిసి 9 మంది సెలబ్రిటీల్లో ఒక కంటెస్టెంట్‌ను నామినేట్ చేయాలని చెప్పగా.. అందరూ బుజ్జిగాడులో ప్రభాస్ మరదలుగా చేసిన సంజనా(Sanjana)ను నామినేట్ చేస్తారు. తన వల్ల వేరే ప్లేయర్‌తో భేదాబిప్రాయాలు మొదలవుతున్నాయని అనగా.. కామనర్ ప్రియా బ్యాక్ బిచ్చింగ్ అంటుంది. దీంతో సంజనా ఫైర్ అయిపోతుంది. అలాంటి పదాలు నొకొద్దని వాదిస్తుంటే.. మరో కంటెస్టెంట్ నా రిలేషన్ గురించి ఎందుకు మాట్లాడారని గొడవ పడుతుంది. అంతటితో ప్రోమో పూర్తి అయింది. ఇక అది చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గత సీజన్లలోమొదటగా ఇంట్లో అందరికీ వంట చేసి పెట్టిన వారంతా మొదటి వారమే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశారు. ఇక ఇప్పుడు సంజనా కూడా ఎలిమినేట్ అవబోతున్నట్లు టాక్.






