- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సల్మాన్‌తో అక్రమ సంబంధం.. ఇంట్లోకి రానివ్వలేదన్న భాగ్యశ్రీ
సల్మాన్ ఖాన్‌తో తనకు ఎఫైర్ ఉందనే రూమర్స్‌పై మరోసారి స్పందించింది భాగ్యశ్రీ.

దిశ, సినిమా: సల్మాన్ ఖాన్‌తో తనకు ఎఫైర్ ఉందనే రూమర్స్‌పై మరోసారి స్పందించింది భాగ్యశ్రీ. 1989లో వచ్చిన ‘మైనే ప్యార్ కియా’లో సల్మాన్ సరసన నటించిన ఆమె.. ఈ సినిమాకు కలిసి పనిచేస్తున్న క్రమంలో హీరోతో అక్రమ సంబంధం అంటగట్టినట్లు తెలిపింది. అయితే ఈ విషయం ప్రముఖ మీడియాల కంటే సినిమా పత్రికలే ఎక్కువగా ప్రచారం చేశాయని, దీంతో అప్పటి నుంచి ఫిల్మ్ మ్యాగజైన్ చదవడం మానేసినట్లు చెప్పింది. అంతేకాదు తన ఇంట్లో కూడా అలాంటివి లేకుండా, రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాన్న నటి.. ‘నా జీవితంలో ఇలాంటి వాటికి చోటు లేదు. నన్నెవరూ అలాంటి క్యారెక్టర్ కలిగిన మనిషిగా గుర్తించలేదు. కానీ, ఆ పత్రికల కారణంగా సినిమా ప్రపంచానికి దూరం కావాలని నిర్ణయించుకున్నా’ అని తెలిపింది భాగ్యశ్రీ.
ఇవి కూడా చదవండి :
లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ ఎంగేజ్మెంట్..?
Tamannaah Bhatia :బాలయ్యతో మిల్క్ బ్యూటీ స్పెషల్ సాంగ్






