- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అందమే ఉంది కానీ యాక్టింగ్ రాదు.. హీరోయిన్ల నటనపై విశ్వక్ సేన్ సెన్సేషనల్ కామెంట్స్
టాలీవుడ్ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ ( Vishwak Sen )తన తాజా చిత్రం ‘ఫంకీ’ విడుదలకు సిద్ధమవుతున్నారు.

దిశ, సినిమా: విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫంకీ’. ఈ సినిమా ప్రమోషన్ల కోసం వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న విశ్వక్, ఇండస్ట్రీలో హీరోయిన్ల ఎంపిక విషయంలో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి ఓపెన్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విశ్వక్ సేన్ ప్రస్తుత రోజుల్లో ప్రతి సినిమాకు సరిపోయే హీరోయిన్‌ను వెతకడం ఒక పెద్ద టాస్క్ అని విశ్వక్ చెప్పుకొచ్చారు. "ఇండస్ట్రీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే హీరోయిన్లు చాలా తక్కువ మంది ఉన్నారు.
మా సినిమా షూటింగ్ 3 నెలల్లో పూర్తి చేయాలనుకున్నా, సరైన హీరోయిన్ దొరకడం కష్టమైపోయింది. ఒకవేళ టాలెంట్ ఉన్న హీరోయిన్లు ఉన్నా, వారు వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల మా పాత్రలకు సెట్ అయ్యే వారు దొరకట్లేదు" అని ఆవేదన వ్యక్తం చేశారు. తనతో పని చేసిన వారిలో ఎవరంటే ఇష్టం అనే ప్రశ్నకు స్పందిస్తూ.. నివేతా పేతురాజ్, మిథిలా పాల్కర్లు మంచి పర్ఫార్మర్స్ అని, వారితో పని చేయడం చాలా బాగుంటుందని విశ్వక్ ప్రశంసించారు. కేవలం గ్లామర్ కోసమే కాకుండా, పాత్రకు తగ్గట్టుగా ప్రాణం పోసే హీరోయిన్లు దొరికినప్పుడే సినిమాకు పరిపూర్ణత వస్తుందని ఆయన చెప్పుకొచ్చారు. హీరోయిన్ల కొరత వల్ల మేకర్స్ పడుతున్న ఇబ్బందులను విశ్వక్ సూటిగా చెప్పడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.






