సెన్సార్ కంప్లీట్ చేసుకుని 'U/A' సర్టిఫికెట్ పొందిన ఫంకీ మూవీ..

by I. Sairam |   (  Updated:2026-02-11 04:47:56  IST  )

మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Viswaksen) కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫెరెంట్ సబ్జెక్ట్స్ ట్రై చేస్తున్నారు.

సెన్సార్ కంప్లీట్ చేసుకుని U/A సర్టిఫికెట్ పొందిన ఫంకీ మూవీ..
X

దిశ, వెబ్‌డెస్క్: మాస్ కా దాస్ విశ్వక్ సేన్(Viswaksen) కెరీర్ స్టార్టింగ్ నుంచి డిఫెరెంట్ సబ్జెక్ట్స్ ట్రై చేస్తున్నారు. అలాంటి సినిమాలతో ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే గత కొన్నేళ్లుగా అతనికి ఆశించిన విజయం అందడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, ఎంత కష్టపడినా హిట్టు మాత్రం దక్కడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ‘ఫంకీ’(Funky) సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. దీనికి జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కేవీ(Anudeep KV) దర్శకత్వం వహిస్తుండగా.. స్టార్ బ్యూటీ కయాదు లోహర్(Kayadu Lohar) హీరోయిన్‌గా నటిస్తోంది.

అయితే ఈ సినిమా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన అన్నీ అప్డేట్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకొని హైప్ పెంచాయి. ఈ క్రమంలో తాజాగా ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో భాగంగా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు యూ/ఎ(U/A) సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే రన్ టైమ్ 130 నిమిషాల (2 గంటల 10 నిమిషాలు) అని వెల్లడించింది. మరి ఈ సినిమాతోనైనా విశ్వక్ కం బ్యాక్ ఇస్తాడేమో చూడాల్సి ఉంది.

అందమే ఉంది కానీ యాక్టింగ్ రాదు.. హీరోయిన్ల నటనపై విశ్వక్ సేన్ సెన్సేషనల్ కామెంట్స్

Next Story