బండ్ల గణేశ్ మరో సెన్సేషన్.. ఇంటర్వ్యూ మధ్యలో మాజీ మంత్రికి ఫోన్ చేసి! (వీడియో)

by Disha Web Desk 7 |
బండ్ల గణేశ్ మరో సెన్సేషన్.. ఇంటర్వ్యూ మధ్యలో మాజీ మంత్రికి ఫోన్ చేసి! (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: నటుడు, నిర్మాత, రాజకీయ నాయకుడు బండ్ల గణేష్ గురించి అందరికీ తెలిసిందే. నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే బండ్లన్న.. వర్తమాన అంశాలపై తన దైన శైలీలో ట్వీట్స్ చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో ఆయన చేసే కొన్ని ట్వీట్స్ ఒక్కోసారి వివాదాలకు దారి తీస్తుంటాయి. ఇదే విధంగా.. తాజాగా బండ్ల గణేష్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మొదట పూరి జగన్నాథ్‌పై కామెంట్స్ చేయగా.. ఇంటర్వ్యూ మధ్యలో మాజీ మంత్రికి కాల్ చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇంటర్వ్యూలో ''మాజీ మంత్రి అనిల్ కుమార్ మీకు వార్నింగ్ ఇచ్చారని వార్తలు వచ్చాయి'' అని ప్రశ్నించగా.. దానికి బండ్ల గణేష్ స్పందిస్తూ.. వెంటనే మాజీ మంత్రి అనిల్ కుమార్‌కు కాల్ చేసి ''హాయ్ అనిల్ అన్న.. మీరు నాకు వార్నింగ్ ఇచ్చారా'' అని అడిగాడు. దానికి అనిల్ కుమార్ ''నేను నీకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాను అన్న'' అని సమాదానం ఇచ్చాడు. వెంటనే అది బండ్ల గణేష్ అంటే అంటూ కౌంటర్ ఇచ్చాడు బండ్ల. కాగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి :

ప్రభాస్ లుక్‌పై బండ్లన్న ట్వీట్.. ఆడేసుకుంటున్న నెటిజన్స్




Next Story

Most Viewed