నాలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న ‘బలగం’ టీమ్

by Chukka Sudharani |   (  Updated:2023-04-03 11:37:36  IST  )

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రజలు బ్రహ్మరతం పడుతున్న సినిమా ‘బలగం’.

నాలుగు ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న ‘బలగం’ టీమ్
X

దిశ, సినిమా: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ప్రజలు బ్రహ్మరతం పడుతున్న సినిమా ‘బలగం’. కమెడియన్ వేణు యెల్దండి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ డ్రామాలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్ ప్రధాన జంటగా నటించారు. ఇక ఇప్పటికే ఉక్రెయిన్‌లో జరిగిన ఓంక్యో ఫిల్మ్ అవార్డ్స్‌‌లో ఈ చిత్రం ‘ఉత్తమ డ్రామా ఫీచర్ ఫిల్మ్ అవార్డు’ను గెలుచుకోగా.. తాజాగా వాషింగ్టన్ DC ఇంటర్నేషనల్ సినిమా ఫెస్టివల్‌‌లో మరో నాలుగు అవార్డులు సొంతంచేసుకుంది. ఉత్తమ ఫీచర్ డైరెక్టర్ (వేణు యెల్దండి), ఉత్తమ నటుడు (ప్రియదర్శి), ఉత్తమ నటి (కావ్య కళ్యాణ్‌రామ్), ఉత్తమ కథనం (వేణు యెల్దండి) అవార్డులను గెలుచుకున్నారు.

ఇవి కూడా చదవండి: మరో కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిన మంచు మనోజ్.. వీడియో వైరల్

Next Story