- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారణాసి సాధువులపై ఆర్య వివాదాస్పద వ్యాఖ్యలు.. బాయ్‌కాట్ చేయాలంటూ హిందూ సంఘాలు ఫైర్
వారణాసిలో ఉండే సాధువులలో దాదాపు 40 శాతం మంది నకిలీ వాళ్లు ఉండే అవకాశం ఉంది.

దిశ, సినిమా: కోలీవుడ్ హీరో ఆర్య తన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ ఎక్స్' ప్రమోషన్లలో భాగంగా చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. వారణాసి సాధువుల గురించి ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారడమే కాకుండా, తీవ్ర విమర్శలకు దారితీశాయి. గతంలో తన కెరీర్ మొదట్లో వచ్చిన 'నేను దేవుణ్ణి' సినిమా కోసం వారణాసిలో షూటింగ్ చేసిన రోజులను ఆర్య ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అప్పట్లో అఘోరాల జీవితాలను చాలా దగ్గరగా చూశానని చెబుతూ.. "వారణాసిలో ఉండే సాధువులలో దాదాపు 40 శాతం మంది నకిలీ వాళ్లు ఉండే అవకాశం ఉంది. చాలా మంది నేరస్థులు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి సాధువుల వేషంలో అక్కడ తిరుగుతుంటారు" అని ఆర్య వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, కుంభమేళా వంటి ప్రాంతాల్లో కొందరి వద్ద ఆయుధాలు కూడా ఉండవచ్చని పోలీసులు తనను అప్పట్లో హెచ్చరించారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు బయటకు రావడంతో హిందూ సంఘాలు, భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు.
అత్యంత పవిత్రమైన వారణాసి పుణ్యక్షేత్రాన్ని, అక్కడ ఉండే సాధువులను నేరస్థులతో పోల్చడం ద్వారా హిందూ ధర్మాన్ని కించపరిచారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రమోషన్ల కోసం ఇలాంటి సున్నితమైన అంశాలను వాడటం తగదని సోషల్ మీడియాలో #BoycottMrX వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ చేస్తున్నారు. పుణ్యక్షేత్రం పవిత్రతను దెబ్బతీసేలా మాట్లాడటం కరెక్ట్ కాదని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మను ఆనంద్ దర్శకత్వంలో శరత్ కుమార్, మంజు వారియర్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన 'మిస్టర్ ఎక్స్' ఈ నెల ఏప్రిల్ 17న విడుదల కానుంది. సరిగ్గా సినిమా రిలీజ్ సమయానికి ఇలాంటి వివాదం చుట్టుముట్టడంతో చిత్ర యూనిట్ ఆందోళన చెందుతోంది. ఆర్య అభిమానులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నప్పటికీ, ఈ వివాదం బాక్సాఫీస్ వసూళ్లపై ఎలాంటి ప్రభావం చూపుతుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు ఈ ఇష్యూపై ఆర్య అధికారికంగా ఎలాంటి వివరణ ఇవ్వలేదు.
పుకార్లకు చెక్ పెట్టిన యష్.. ‘టాక్సిక్’ అలాంటి కథ కాదంటూ ఆసక్తికర కామెంట్స్






