ఆ కారణంగానే మలైకాతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోలేదు: అర్జున్

by Disha Web Desk 7 |
ఆ కారణంగానే మలైకాతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోలేదు: అర్జున్
X

దిశ, సినిమా : బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్ తనకు కోవిడ్ సోకిందన్న పుకార్లను ఖండించాడు. అలాగే ప్రియురాలు మలైకాతో క్రిస్మస్ వేడుకలకు హాజరుకాకపోవడంపై కూడా క్లారిటీ ఇచ్చాడు. ఈ మేరకు బెడ్‌పై పడుకుని రెస్ట్ తీసుకుంటున్న నటుడు తలపై క్రిస్మస్ నావెల్టీ హెడ్ బ్యాండ్ ధరించిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ 'ఈ హాలిడే సీజన్‌లో అనారోగ్యంతో ఉన్నాను.

పండుగపూట ఎవరూ చింతించకండి ఇది కోవిడ్ కాదు. #క్రిస్మస్ మూడ్' అని క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం వైరల్ అవుతున్న పోస్ట్‌పై స్పందిస్తున్న సెలబ్రిటీలు, ఫ్యాన్స్ అర్జున్‌ తొందరగా కోలుకోవాలంటూ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇదిలావుంటే.. గతరాత్రి తన క్రిస్మస్ పార్టీ నుంచి కొన్ని చిత్రాలను పంచుకున్న మలైకా.. 'మెర్రీ క్రిస్మస్... అర్జున్ కపూర్‌ని మిస్ అయ్యాం' అంటూ తన కుటుంబంతో ఎంజాయ్ చేసిన పిక్స్ అభిమానుతో పంచుకుంది.

ఇవి కూడా చదవండి :

1.క్రిస్మస్‏ స్పెషల్: అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన రౌడీ హీరో Vijay Deverakonda

2.విజయవాడలో కొత్తగా మల్టీప్లెక్స్‌ను ప్రారంభించిన ఐనాక్స్‌

Next Story