క్రిస్మస్‏ స్పెషల్: అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన రౌడీ హీరో Vijay Deverakonda

by Disha Web Desk 7 |
క్రిస్మస్‏ స్పెషల్: అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన రౌడీ హీరో Vijay Deverakonda
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ గత ఐదేళ్లుగా ప్రతి క్రిస్మస్‏కు తన అభిమానులు బహుమతులిస్తున్నాడు. అయితే ఈ అనవాయితీని మిస్ చేయకుండా పాటిస్తున్న విజయ్.. ఒక్కో ఏడాది ఒక్కో కాన్సెప్ట్‌తో గిఫ్ట్స్ ఇవ్వడం విశేషం. కాగా ఈ ఏడాది కూడా దాదాపు 100 మంది అభిమానులకు బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఈ క్రిస్మస్ కానుకగా సరికొత్తగా ప్లాన్ చేసిన ఆయన..

'మీలో 100 మందిని హాలీడే ట్రిప్‌కు పంపించాలనుకుంటున్నా. గమ్యాన్ని ఎంచుకోవడంలో నాకు సహాయం చేయండి' అని కోరుతూ ట్వీట్ చేశాడు. అంతేకాదు ఇండియాలోని పర్వతాలు, చారిత్రక ప్రదేశాలు, బీచ్‌లు, ఎడారిని సూచించగా ఎక్కువమంది పర్వతాలు చుట్టివచ్చేందుకు ఆసక్తి చూపించారు. ఇక తన ట్వీట్‌కు వచ్చిన రిప్లైల ఆధారంగా 100 మందిని ఎంపిక చేసి తన సొంత ఖర్చులతో టూర్లకు పంపించనున్నాడు విజయ్.

ఇవి కూడా చదవండి : ఆ కారణంగానే మలైకాతో క్రిస్మస్ వేడుకలు జరుపుకోలేదు: అర్జున్

Next Story

Most Viewed