మరోసారి వేశ్యగా అనుష్క శెట్టి వేదంను మించిన సీన్స్.. తన సినీ కెరీర్ నాశనం కానుందా?

by Disha Web Desk 6 |
మరోసారి వేశ్యగా అనుష్క శెట్టి వేదంను మించిన సీన్స్.. తన సినీ కెరీర్ నాశనం కానుందా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నాగార్జున సూపర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఆ తర్వాత స్టార్ హీరోలతో నటించడంతో పాటుగా.. లేడీ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేసి ఫ్యాన్ బేస్‌ను పెంచుకుంది. అంతేకాకుండా వేదం మూవీతో ఏకంగా వేశ్యగా నటించి అందరికీ షాకిచ్చింది. దీంతో అనుష్క శెట్టి క్రేజ్ మరింత పెరిగింది. అయితే ఈ అమ్మడు గత కొద్ది కాలంగా సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. అధికంగా బరువు పెరగడంతో ఆఫర్లు లేక ఖాళీగా ఉండిపోయింది. ఇటీవల మళ్లీ ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది.

తాజాగా, స్వీటీ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీనికి క్రిష్ దర్శకత్వం వహిస్తుండగా.. యూవీ క్రియేషన్స్‌తో పాటు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్మెంట్ నిర్మిస్తున్నాయి. అంతేకాకుండా ఈ చిత్రానికి ఘాతి అనే టైటిల్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో అనుష్క శెట్టి మరోసారి వేశ్యగా నటించబోతుందట. అంతేకాకుండా వేదంకు మించిన సీన్స్ ఇందులో ఉండబోతున్నాయని తెలుస్తోంది. దీనికి సంబంధించిని ఫస్ట్ లుక్ పోస్టర్‌ను అమెజాన్ ప్రైమ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. అయితే ఓ వలలో చిక్కుకున్న మహిళ.. ఎలా పోరాడింది తనను తాను కాపాడుకుని సమస్యల నుంచి తెలివిగా ఎలా బయటపడింది అనే దానిపై కథ ఆధారపడి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలిసిన వారంతా ఈ సినిమా ఆమెకు ప్లస్ అవుతుందా? లేక మైనస్ అయి సినీ కెరీర్ నాశనం అవుతుందా? అని ఆందోళన చెందుతున్నారు.

Read More..

శ్రీలీల పై మనసుపారేసుకున్న స్టార్ క్రికెటర్.. ఆమె చేసిన పనికి ఫిదా అయిపోయానంటూ కామెంట్స్


Next Story