- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anupama Parameswaran: యంగ్ హీరోతో అనుపమ కళ్యాణం.. అధికారిక ప్రకటనతో షాకిచ్చిన బ్యూటీ
అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతోంది.

దిశ, సినిమా: అనుపమ పరమేశ్వరన్(Anupama Parameswaran) ప్రస్తుతం ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతోంది. వరుస ప్రాజెక్ట్స్‌ను అనౌన్స్ చేస్తూ తెలుగు, తమిళ, మలయాళ ఇండస్ట్రీల్లో తన బిజీ షెడ్యూల్‌ను మరింత పెంచుకుంది. గత ఏడాది అనుపమ కెరీర్‌కు బాగా కలిసొచ్చిందని చెప్పాలి. నటిగా తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చింది. ఇదిలా ఉంటే.. కొంతకాలంగా అనుపమ, ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఫేమ్ అఖిల్ రాజ్(Akhil Raj)తో కలిసి ఓ సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. వీరిద్దరి కాంబోలో ఓ లవ్ స్టోరీ తెరకెక్కుతుందన్న ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగింది. ఈ వార్తలపై స్పష్టత రావాలని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో, తాజాగా అనుపమ స్వయంగా చేసిన ప్రకటన అందరినీ షాక్‌కు గురి చేసింది. అనుపమ, తరుణ్ భాస్కర్ కాంబోలో ఓ మూవీ రాబోతున్నట్లు వెల్లడించింది.
భద్రప్ప గాజుల (Bhadrappa Gajula)దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు ‘క్రేజీ కళ్యాణం’ అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రంలో రాజు వెడ్స్ రాంబాయి ఫేమ్ అఖిల్ రాజ్, నరేష్ విజయ్ కృష్ణ కీలక పాత్రల్లో కనిపించనుండగా, ఆరో సినిమాస్ బ్యానర్‌పై భూసమ్ జగన్ మోహన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా ఆరో సినిమాస్‌కు రెండో ప్రాజెక్ట్‌గా రూపొందుతోంది. ఇప్పటి వరకు చూడని డిఫరెంట్ కాంబినేషన్‌లో, 100 శాతం ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించబోతున్నామని అనుపమ వెల్లడించింది. ఈ అనౌన్స్‌మెంట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, నెటిజన్లు “క్రేజీ కాంబో… తప్పకుండా చూడాల్సిందే” అంటూ కంగ్రాట్స్ కామెంట్లతో సినిమాపై ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు.
Read More..






