బాలీవుడ్‌లో అనుపమకు భారీ ఆఫర్

by Disha Web Desk 7 |
బాలీవుడ్‌లో అనుపమకు భారీ ఆఫర్
X

దిశ, సినిమా : 'కార్తికేయ 2' మూవీ సక్సెస్‌ తర్వాత హీరోయిన్ అనుపమ తన కెరియర్‌లో కీలక అడుగు వేసేందుకు సిద్ధంగా ఉంది. రీసెంట్‌గా ఒక అగ్ర నిర్మాణ సంస్థ అనుపమను బాలీవుడ్‌లో లాంచ్ చేసేందుకు మంచి స్క్రిప్ట్‌తో అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయమై చర్చలు ఇంకా ముగింపు దశకు చేరుకోలేదని సమాచారం. వాస్తవానికి కొంతకాలంగా దక్షిణాదిన మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్లపై బీటౌన్ ప్రొడక్షన్ హౌస్‌లు ఆసక్తి చూపిస్తుండటం తెలిసిందే. టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ సమంత, పూజా హెగ్డే ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటమే ఇందుకు నిదర్శనం. కాగా అనుపమ కూడా త్వరలో ఇదే జాబితాలో చేరనుంది. ఇదిలా ఉంటే.. తెలుగులో 'డీజే టిల్లు 2' సినిమాలో హీరో సిద్ధుకు జోడీగా నటించేందుకు ఓకే చెప్పింది అనుపమ.

రూ. 251 కోట్ల దోపిడి.. స్టార్ హీరోయిన్ అరెస్ట్?

Next Story