Devara : ‘దేవర’ నుంచి మరో కొత్త అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయమా?

by Disha Web Desk 9 |
Devara : ‘దేవర’ నుంచి మరో కొత్త అప్‌డేట్‌.. ఫ్యాన్స్‌కు పూనకాలు ఖాయమా?
X

దిశ, వెబ్‌డెస్క్: జూనియర్ ఎన్టీఆర్.. మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న భారీ చిత్రం ‘దేవర’. జనతా గ్యారేజ్ తర్వాత తారక్‌తో కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోన్న ఈ చిత్రంపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెంచేసుకున్నారు. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించినట్టు తెలుస్తోంది. అయితే, ఈ షెడ్యూల్‌లో షూట్ చేసిన స్పెషల్ నైట్ ఎఫెక్ట్ యాక్షన్ సీక్వెన్స్ గురించి మూవీ సినిమాటోగ్రాఫర్ ఆర్.రత్నవేలు తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చాడు. ‘‘మముత్ మిడ్-సీ నైట్ యాక్షన్‌ను పూర్తి చేశాను. తారక్ సోదరుడితో నీటి అడుగున, నీటిపై చిత్రీకరణ జరిగింది. ఎన్టీఆర్‌తో నైట్ ఎఫెక్ట్‌‌లో, తక్కువ లైట్‌లో, నీళ్లల్లో అదిరిపోయే యాక్షన్ సీన్స్ షూట్ ఇప్పుడే కంప్లీట్ అయ్యిందని ట్వీట్ చేశాడు. అంతేకాకుండా దీనికి షూటింగ్ స్పాట్‌లోని ఓ ఫొటోను కూడా జతచేశాడు.

Read More : Devara : తారక్ ‘దేవర’లో మరో బాలీవుడ్ హీరోయిన్?


Next Story