లైవ్ ఫర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేసిన Anirudh.. ‘ఛలేయా’కు మరోసారి నెటిజన్లు ఫిదా

by Disha Web Desk 10 |
లైవ్ ఫర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేసిన Anirudh.. ‘ఛలేయా’కు మరోసారి నెటిజన్లు ఫిదా
X

దిశ, సినిమా: యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మరోసారి లైవ్‌ ఫర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేశాడు. షారుఖ్, నయనతార ప్రధానపాత్రల్లో అట్లీ తెరకెక్కించిన ‘జవాన్’ వీర విధ్వంసం ఇంకా కొనసాగుతూనే ఉండగా.. ఇప్పటివరకు ఈ మూవీ రూ.695 కోట్లు కొల్లగొట్టింది. అయితే ఈ సినిమాకు సంగీతం అందించిన అనిరుధ్‌పై కూడా ప్రశంసల వర్షం కురుస్తోంది. ముఖ్యంగా ‘ఛలేయా’ సాంగ్ థియేటర్‌లో చూసిన తర్వాత నార్త్ ఫ్యాన్స్ అనిరుధ్ సంగీతానికి ఫిదా అయ్యామంటూ పొగిడేస్తున్నారు. ఈ క్రమంలోనే హిందీలో అర్జిత్‌ సింగ్‌ ఆలపించిన పాటను స్వయంగా పాడిన అనిరుధ్.. ఈ స్పెషల్ వీడియోను సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతుండగా నెటిజన్లు పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి : ‘కాంతార’ ప్రీక్వెల్‌ నుంచి సాలిడ్ అప్ డేట్.. నయా లుక్‌లో రిషబ్!


Next Story

Most Viewed