‘కాంతార’ ప్రీక్వెల్‌ నుంచి సాలిడ్ అప్ డేట్.. నయా లుక్‌లో రిషబ్!

by Disha Web Desk 10 |
‘కాంతార’ ప్రీక్వెల్‌ నుంచి సాలిడ్ అప్ డేట్.. నయా లుక్‌లో రిషబ్!
X

దిశ, సినిమా: నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ‘కాంతార’ ప్రీక్వెల్‌కు సంబంధించిన ఓ సాలిడ్ అప్ డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సెకండ్‌ పార్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా కోసం రిషబ్‌ శెట్టి 11కిలోల బరువు తగ్గినట్లు తెలుస్తోంది. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేయడంతో బాడీ భారీగా తగ్గించాడని, ఫస్ట్ పార్ట్ ఊహించని రేంజ్‌లో హిట్టు కావడంతో రిషబ్‌ శెట్టికి హోంబలే సంస్థ కూడా పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు సమాచారం. దీంతో ప్రీక్వెల్‌ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లే విధంగా రిషబ్‌ ప్లాన్‌ చేస్తున్నాడట. అంతేకాకుండా కాంతార-1లో ఒకరిద్దరూ మినహాయించి పెద్దగా స్టార్‌ కాస్ట్‌ ఏమి లేకపోగా.. ప్రీక్వెల్‌లో మాత్రం పలువురు స్టార్స్‌ను తీసుకోబోతున్నట్లు టాక్‌. ఇక నవంబర్‌లో షూటింగ్‌ను మొదలుప్టెటి వచ్చే ఏడాది ద్వితియార్థంలో సినిమాను ప్రేక్షకులు ముందుకు తీసుకురావాలని ప్లాన్‌ చేస్తున్నారట మేకర్స్. ఇక తొలిపార్టుకు రూ.16 కోట్లు ఖర్చుపెట్టగా ప్రీక్వెల్‌ కోసం ఏకంగా రూ.120 కోట్ల బడ్జెట్ పెట్టబోతున్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి : లైవ్ ఫర్ఫార్మెన్స్‌తో అదరగొట్టేసిన అనిరుధ్.. ‘ఛలేయా’కు మరోసారి నెటిజన్లు ఫిదా

Next Story

Most Viewed