Ananya Panday To Make Her OTT Debut Soon With 'Call Me Bae'? Here's What We Know

by Mallepaka Hamsa |   (  Updated:2022-09-26 07:54:21  IST  )

ధర్మ ప్రొడక్షన్ హౌస్‌ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ బ్యూటీ అనన్య పాండే తిరిగి అదే సంస్థ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది..Latest Telugu News

Ananya Panday To Make Her OTT Debut Soon With Call Me Bae? Heres What We Know
X

దిశ, సినిమా : ధర్మ ప్రొడక్షన్ హౌస్‌ ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన యంగ్ బ్యూటీ అనన్య పాండే తిరిగి అదే సంస్థ ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె నటించనున్న 'కాల్ మి బే' షోను ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనుండగా.. ఈ వెబ్‌సిరీస్‌ను అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం. కాగా ఈ సిరీస్‌లో అనన్య బిలియనీర్ ఫ్యాషన్ డిజైనర్‌గా నటించనుంది. రిచ్ ఫ్యామిలీ నుంచి వచ్చి స్కామ్‌లో చిక్కుకున్న యువతి.. దాని నుంచి ఎలా బయటపడిందనే ఆసక్తికర కథనంతో ఈ సిరీస్ తెరకెక్కనుంది. అలాగే ఈ షోలో పలువురు బాలీవుడ్ స్టార్ యాక్టర్స్ కీలక పాత్రలు పోషించనున్నారు. ఇషితా మొయిత్రా, సమీనా మోట్లేకర్, రోహిత్ నాయర్ తదితరులు రాసిన స్క్రిప్ట్‌కు కొలిన్ డి కున్హా దర్శకత్వం వహించనున్నారు. ఇదేగాక అనన్య.. ఆయుష్మాన్ ఖురానాకు జోడీగా 'డ్రీమ్ గర్ల్-2' చిత్రంలో నటిస్తోంది.

ఇవి కూడా చ‌ద‌వండి:

షాకింగ్ న్యూస్.. Bigg Boss Telugu season 6 షో ఆపేయాలని నిర్ణయం తీసుకున్న స్టార్ మా?

Next Story