త్రివిక్రమ్-వెంకటేష్ మూవీలో ఊహించని ట్విస్ట్ .. హర్షవర్ధన్ ఔట్ గురువు కోసం రంగంలోకి తమన్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-23 08:48:04  IST  )

త్రివిక్రమ్‌తో తమన్‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. తన గురువుగా భావించే త్రివిక్రమ్ అడిగిన వెంటనే, తమన్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.

త్రివిక్రమ్-వెంకటేష్ మూవీలో ఊహించని ట్విస్ట్ .. హర్షవర్ధన్ ఔట్ గురువు కోసం రంగంలోకి  తమన్!
X

దిశ, సినిమా: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రం ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో ఒక ఆసక్తికరమైన మార్పు చోటు చేసుకుంది. ఈమూవీకి మొదట మ్యూజిక్ డైరెక్టర్‌గా హర్షవర్ధన్ రామేశ్వర్‌ను అనుకున్నప్పటికీ, అనూహ్యంగా ఆయన తప్పుకోవడంతో సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ రంగంలోకి దిగినట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే శరవేగంగా జరుగుతోంది. అయితే, సంగీత దర్శకుడు హర్షవర్ధన్ రామేశ్వర్‌కు, దర్శకుడు త్రివిక్రమ్‌కు మధ్య కొన్ని అభిప్రాయ భేదాలు తలెత్తాయని, అందుకే ఆయన ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సమాచారం. త్రివిక్రమ్‌తో తమన్‌కు ఉన్న సాన్నిహిత్యం గురించి అందరికీ తెలిసిందే. తన గురువుగా భావించే త్రివిక్రమ్ అడిగిన వెంటనే, తమన్ ఈ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘అల వైకుంఠపురములో’, ‘అరవింద సమేత’ వంటి చిత్రాల సాంగ్స్ ఎంతటి సంచలనం సృష్టించాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

అయితే, ఈ మార్పుపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయంలో కూడా ఇలాగే జరిగింది. చివరి నిమిషంలో దేవిశ్రీ ప్రసాద్ తప్పుకోగా తమన్ సంగీతం అందించారు. కానీ, ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఇప్పుడు ‘ఆదర్శ కుటుంబం’ విషయంలోనూ అదే సీన్ రిపీట్ కావడంతో, వెంకటేష్ హిట్ కొట్టడం కష్టమేమోనని కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, త్రివిక్రమ్-తమన్ కాంబినేషన్ అంటేనే మ్యూజికల్ హిట్ గ్యారెంటీ అని, శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని మరికొందరు ధీమా వ్యక్తం చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్, త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్ తోడైతే రికార్డులు తిరగరాయడం ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు.

పెద్ది నుంచి సంయుక్త ఔట్? ఆ హీరోయిన్ తోనే ఐటెం సాంగ్ !

Next Story