పెద్ది నుంచి సంయుక్త ఔట్? ఆ హీరోయిన్ తోనే ఐటెం సాంగ్ !

by velandi.Saikiran |   (  Updated:2026-04-23 08:47:22  IST  )

పెద్ది నుంచి సంయుక్త ఔట్ కాగా, ఆమె స్థానంలో శృతిని ఫైన‌ల్ చేశార‌ట‌.

పెద్ది నుంచి సంయుక్త ఔట్? ఆ హీరోయిన్ తోనే ఐటెం సాంగ్ !
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా పెద్ది. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరుస్తున్నారు. ఈ సినిమాలో జగపతి బాబు, శివరాజ్ కుమార్ లాంటి కీలక నటులు కూడా ఉన్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా షూటింగ్ దాదాపు ఫినిష్ అయిపోయింది. కేవలం ఆరు రోజుల షూటింగ్ జరిగితే, ప్యాకప్ చెప్పనున్నారు.

కేవలం ఐటమ్ సాంగ్ మాత్రమే..!

పెద్ది సినిమా షూటింగ్ దాదాపు ఫినిష్ కాగా.. ఐటమ్ సాంగ్ షూట్ మాత్రమే మిగిలి ఉంది. ఇందులో ఐటమ్ సాంగ్ కోసం ముందుగా సంయుక్త మీనన్ ను ఫైనల్ చేశారు. దీనిపై అధికారిక ప్రకటన వస్తుందని అందరూ అనుకున్న నేపథ్యంలో.. తెరపైకి మరో హీరోయిన్ పేరు వచ్చింది. శృతి హాసన్ ను ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం తీసుకున్నట్లు పార్క్ నడుస్తోంది.

దీనిపై రేపు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అలాగే అక్టోబర్ 26వ తేదీ నుంచి ఐటెం సాంగ్ షూటింగ్ కూడా ప్రారంభం కానుందని చర్చ జరుగుతోంది. హైదరాబాద్ శివారులోని జన్వాడ వద్ద ప్రత్యేకంగా ఓ సెట్ కూడా వేశారట. అక్కడే ఐటెం సాంగ్ షూట్ ఉంటుందని టాక్. కాగా ఈ సినిమాకు ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తుండగా.. జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా ఉన్నారు.

త్రివిక్రమ్-వెంకటేష్ మూవీలో ఊహించని ట్విస్ట్ .. హర్షవర్ధన్ ఔట్ గురువు కోసం రంగంలోకి తమన్!

Next Story