- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంజయ్ లీలా భన్సాలీ భారీ మైథలాజికల్ థ్రిల్లర్‌లో ఊహించని ట్విస్ట్..
సంజయ్ లీలా భన్సాలీ మార్క్ గ్రాండియర్ మిత్రన్ టేకింగ్ తోడైతే ఈ సినిమా ఒక విజువల్ వండర్‌గా నిలవడం ఖాయం.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన పీరియడ్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ చేయాల్సిన ఒక భారీ బాలీవుడ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చెంతకు చేరడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో, తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ఒక ‘మైథలాజికల్ జంగిల్ డ్రామా’ను ప్లాన్ చేశారు. మొదట ఈ కథ కోసం దర్శకుడు పి.ఎస్. మిత్రన్, రామ్ చరణ్‌నే సంప్రదించారట. అయితే, రామ్ చరణ్ ప్రస్తుతం ‘పెద్ది’ సినిమాతో పాటు బుచ్చిబాబు సనా ఇతర భారీ ప్రాజెక్టులకు కమిట్ అయి ఉండటంతో డేట్స్ సర్దుబాటు కాలేదట. దీంతో ఈ అవకాశం మరో వెర్సటైల్ నటుడు ధనుష్‌కు వెళ్ళిందని టాక్. రామ్ చరణ్ స్థానంలో ధనుష్ పేరు వినిపించగానే, మెగా అభిమానుల్లో కాస్త అసహనం వ్యక్తమైనప్పటికీ, ఇది కేవలం కాల్‌షీట్ల సమస్య వల్లే జరిగిందని తెలుస్తోంది.
ధనుష్ ఇప్పటికే ‘రాంఝణా’, ‘అత్రంగి రే’, ‘తేరే ఇష్క్ మే’ వంటి చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితులే. ఇప్పుడు ఏకంగా భన్సాలీ ప్రొడక్షన్‌లో ఒక మైథలాజికల్ థ్రిల్లర్ చేస్తుండటం ఆయన కెరీర్‌లో ఒక పెద్ద మలుపు కానుంది. అడవి నేపథ్యంలో సాగే ఈ పురాణ గాథ కోసం స్క్రిప్ట్ ఇప్పటికే సిద్ధమైంది. పి.ఎస్. మిత్రన్ ఈ ప్రాజెక్ట్‌తో హిందీలోకి దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. సంజయ్ లీలా భన్సాలీ మార్క్ గ్రాండియర్ మిత్రన్ టేకింగ్ తోడైతే ఈ సినిమా ఒక విజువల్ వండర్‌గా నిలవడం ఖాయం. ప్రస్తుతం ధనుష్ తన ఇతర కమిట్‌మెంట్స్‌ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఈ మైథలాజికల్ జంగిల్ డ్రామా షూటింగ్ 2027 ప్రారంభంలో పట్టాలెక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ తనదైన శైలిలో గ్లోబల్ ప్రాజెక్టులతో దూసుకుపోతుండగా, ధనుష్ ఈ భారీ చిత్రంతో బాలీవుడ్‌లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని చూస్తున్నారు. ధనుష్-భన్సాలీ సినిమా 2027లో ప్రేక్షకులను అలరించనుంది.






