అవన్నీ అసత్య వార్తలు.. రణవీరే మా డాన్

by Chukka Sudharani |

‘రణవీర్ ‘డాన్ 3’ ప్రాజెక్ట్ నుండి తప్పుకో లేదు. ఆయనే మా డాన్.

అవన్నీ అసత్య వార్తలు.. రణవీరే మా డాన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ ఫ్రాంచైజీలో ‘డాన్ 3’ ఒకటి. అమితా బచ్చన్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్‌లతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న ఈ ఫ్రాంచైజీలో ఇప్పుడు వస్తున్న మూడో భాగం కోసం ప్రేక్షకులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే పార్ట్ 3పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా వచ్చేసింది. దర్శకుడు ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్న ‘డాన్ 3’లో రణవీర్ సింగ్ హీరోగా నటిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. కొన్ని అనివార్య కారణాల చేత ఈ సినిమా నుంచి రణవీర్ సింగ్ తప్పుకున్నట్లు గత కొద్ది కాలంగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఎట్టకేలకు ఈ పుకార్లపై డైరెక్టర్ ఫర్హాన్ అక్తర్ స్పందించి క్లారిటీ ఇచ్చాడు. ‘రణవీర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకో లేదు. ఆయనే మా డాన్. భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కే ముందు స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులకు కాస్త సమయం పడుతుంది. దీంతో ఈ గ్యాప్‌లో ఎన్నో అసత్య వార్తలు వస్తాయి. వాటన్నిటి పట్టించుకోకండి.. డాన్ 3కు సంబంధించి ఏదైనా అప్డేట్ ఉంటే అది మేము మాత్రమే ప్రకటిస్తాము’ అంటూ ఎట్టకేలకు మౌనం వీడాడు డైరెక్టర్ అక్తర్.

Next Story