- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘జై హనుమాన్’ మూవీలో ఊహించని సర్‌ప్రైజ్.. కథను మలుపు తిప్తే పాత్రలో టాలీవుడ్ హీరో!
రానా కేవలం అతిథి పాత్రలో కాకుండా, కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన క్యారెక్టర్‌లో కనిపిస్తారని టాక్.

దిశ, సినిమా: ప్రశాంత్ వర్మ సృష్టించిన పివిసియు (PVCU) సినిమాటిక్ యూనివర్స్‌లో వచ్చిన ‘హనుమాన్’ ఎలాంటి సంచలనం సృష్టించిందో మనందరికీ తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై, ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన ఈ చిత్రం తర్వాత, ఇప్పుడు అందరి దృష్టి దీని సీక్వెల్ ‘జై హనుమాన్’ పైనే ఉంది. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. తాజా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ భారీ పాన్ ఇండియా చిత్రంలో దగ్గుబాటి హీరో రానా ఒక పవర్ ఫుల్ పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానా కేవలం అతిథి పాత్రలో కాకుండా, కథను మలుపు తిప్పే అత్యంత కీలకమైన క్యారెక్టర్‌లో కనిపిస్తారని టాక్. రానాకు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్, ఆయన గంభీరమైన వాయిస్ ఈ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అవుతాయని మేకర్స్ భావిస్తున్నారట. ఒకవేళ ఇదే నిజమైతే, రానా ఎంట్రీతో ఈ చిత్రం స్థాయి మరో మెట్టు పైకి వెళ్లడం ఖాయం.
ఈ సీక్వెల్‌లో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండగా, ‘హనుమాన్’లో హీరోగా మెప్పించిన తేజ సజ్జా కూడా ఒక ముఖ్య పాత్రలో అలరించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరో విశేషమేమిటంటే, ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. కీరవాణి ఒక మైథలాజికల్ టచ్ ఉన్న సినిమాకు మ్యూజిక్ ఇస్తుండటంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రస్తుతానికి రానా రాకపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు చూస్తుంటే రానా ఈ ప్రాజెక్టులో ఉండటం దాదాపు ఖాయమని ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోతున్నారు అభిమానులు. ప్రశాంత్ వర్మ విజన్, రానా లాంటి నటుడి పెర్ఫార్మెన్స్ తోడైతే బాక్సాఫీస్ వద్ద మరో మ్యాజిక్ ఖాయం అని అంటున్నారు.
యాంకర్ ‘పాపం హరీష్’ అన్నారు.. ‘ఉస్తాద్’ ఫెయిల్యూర్‌పై ఓపెన్ అయిన హరీష్ శంకర్






