యాంకర్ ‘పాపం హరీష్’ అన్నారు.. ‘ఉస్తాద్’ ఫెయిల్యూర్‌పై ఓపెన్ అయిన హరీష్ శంకర్

by Pulgam srinivas |   (  Updated:2026-04-11 10:54:00  IST  )

హరీష్ శంకర్ మాట్లాడుతూ... నేను స్టేజ్‌పైకి వచ్చే సమయంలో ‘పాపం హరీష్’ అని అనగానే, నా లేటెస్ట్ సినిమా బాగా ఆడలేదు కాబట్టి నన్నే ఉద్దేశించి అలా అన్నారని అనుకున్నానని చెప్పుకొచ్చారు.

యాంకర్ ‘పాపం హరీష్’ అన్నారు.. ‘ఉస్తాద్’ ఫెయిల్యూర్‌పై ఓపెన్ అయిన హరీష్ శంకర్
X

దిశ, వెబ్ డెస్క్: యువ నటుడు తిరువీర్ తాజాగా హీరోగా నటించిన పాపం ప్రతాప్ చిత్రం ఏప్రిల్ 17వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ బృందం ఈరోజు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సినిమా పేరు ‘పాపం ప్రతాప్’ కావడంతో, ఈ ఈవెంట్‌కు యాంకర్‌గా వ్యవహరించిన స్రవంతి స్టేజ్‌పైకి అతిథులను ఆహ్వానించే సమయంలో ‘పాపం’ అనే పదాన్ని జోడిస్తూ వారి పేర్లను పిలుస్తూ వచ్చారు.

అందులో భాగంగా హరీష్ శంకర్ స్టేజ్‌పైకి రావాల్సిన సమయంలో యాంకర్ ‘పాపం హరీష్’ అని పిలవడంతో అక్కడ ఒక్కసారిగా నవ్వులు వెల్లువెత్తాయి. అనంతరం స్టేజ్‌పై మాట్లాడిన హరీష్ శంకర్, యాంకర్ తనను ‘పాపం హరీష్’ అని పిలవడం గురించి సరదాగా స్పందించారు. “నేను స్టేజ్‌పైకి వచ్చే సమయంలో ‘పాపం హరీష్’ అని అనగానే, ఇటీవల విడుదలైన నా సినిమా బాగా ఆడలేదు కాబట్టి నన్నే ఉద్దేశించి అలా అన్నారని అనుకున్నాను. కానీ ఆమె అందరినీ అలాగే పిలుస్తుండటంతో నన్ను ప్రత్యేకంగా అనలేదని తెలుసుకుని రిలాక్స్ అయ్యాను” అంటూ ఆయన చెప్పుకొచ్చారు.

ప్రస్తుతం హరీష్ శంకర్ చేసిన ఈ సరదా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. ఇక ‘పాపం ప్రతాప్’ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ హీరోయిన్‌గా నటించగా, ఎస్. పి. దుర్గా నరేష్ దర్శకత్వం వహించారు. ఈటీవీ విన్ ఒరిజినల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది.

ఓటీటీలోకి రాబోతున్న ‘ఉస్తాద్ భగత్‌సింగ్’.. స్ట్రీమింగ్ తేదీ రివీల్ చేసిన శ్రీలీల

Next Story