కాంతార-2 నుంచి కీలక అప్‌ డేట్.. రిషభ్ శెట్టి ఏమన్నారంటే..!

by Disha Web Desk 1 |
కాంతార-2 నుంచి కీలక అప్‌ డేట్.. రిషభ్ శెట్టి ఏమన్నారంటే..!
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో రిషభ్ శెట్టి ప్రధాన పాత్రలో నటించి దర్శకత్వం వహించిన 'కాంతార' మూవీ అఖండ విజయం సాధించింది. కన్నడ సినీ ఇండస్ట్రీలో కేజీఎఫ్ తర్వాత రికార్డులను బద్దలు కొట్టిన ఈ మూవీ భాషలతో సంబంధం లేకుండా దేశం అంతటా రికార్డులను నెలకొల్పి, సినీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో 'కాంతారా-2' కోసం ఫ్యాన్స్ చాలా ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. తాజాగా, కాంతారా-2పై రిషభ్ శెట్టి కీలక అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు కొనసాగుతున్నాయని, లొకేషన్ సెర్చ్‌తో పాటు ఆర్టిస్టుల ఎంపిక జరుగుతోందని తెలిపాడు. షూటింగ్ అప్‌ డేట్ ను త్వరలో హోంబాలే ఫిల్మ్స్ అధికారికంగా ప్రకటిస్తుందన్నారు. ఈ ఏడాది చిత్రీకరణ పూర్తి చేసి 2024లో సినిమా విడుదల చేస్తామని వెల్లడించాడు.

Also Read: మొదటి సారి అలాంటి పాత్రలో మెరవబోతున్న మెహ్రీన్.. సక్సెస్ అవుతుందా?

Next Story