- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అనుకోకుండా పొరపాటు జరిగింది.. నోరా జారా దయచేసి నన్ను క్షమించండి.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ నటుడి పోస్ట్
నేను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు, కేవలం నోరు జారడమే. నా ఇన్నేళ్ల కెరీర్‌లో కుల ప్రస్తావన తేవడం ఇదే మొదటిసారి.

దిశ, సినిమా: సినీ పరిశ్రమలో అగ్ర నటుడు, దర్శకుడు పార్తీబన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. వైవిధ్యమైన పాత్రలతో మెప్పించే ఆయన, ఇటీవల జరిగిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారాన్ని రేపాయి. గతంలో త్రిష, విజయ్ రిలేషన్‌షిప్‌పై కామెంట్స్ చేసి క్షమాపణలు చెప్పిన పార్తీబన్, ఇప్పుడు కుల ప్రస్తావన తెచ్చి నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వేడుకలో ప్రసంగిస్తున్న సమయంలో పార్తీబన్ అనుకోకుండా కులం గురించి మాట్లాడారు. ఇది కాస్తా వివాదాస్పదం కావడంతో నెటిజన్లు ఆయనపై విమర్శల వర్షం కురిపించారు.
వివాదం ముదురుతోందని గ్రహించిన పార్తీబన్ వెంటనే అప్రమత్తమై, సోషల్ మీడియా వేదికగా ఒక సుదీర్ఘమైన ఎమోషనల్ నోట్‌ను విడుదల చేస్తూ బేషరతుగా క్షమాపణలు కోరారు. తన నోట్‌లో పార్తీబన్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. "నేను ఉద్దేశపూర్వకంగా అలా మాట్లాడలేదు, కేవలం నోరు జారడమే. నా ఇన్నేళ్ల కెరీర్‌లో కుల ప్రస్తావన తేవడం ఇదే మొదటిసారి. నిజానికి కుల వ్యవస్థను వ్యతిరేకిస్తూ నేను ఎన్నో సినిమాలు తీశాను. నా ప్రతిభను నమ్ముకుంటానే తప్ప కులాన్ని వాడుకునే వ్యక్తిని కాను. నా వ్యాఖ్యల వల్ల ఎంతోమంది మనోభావాలు దెబ్బతిన్నాయని అర్థమైంది. మీకంటే ఈ విషయంలో నేనే ఎక్కువ బాధపడుతున్నాను" అని పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని, తనపై ఉన్న నమ్మకాన్ని కాపాడుకుంటానని ఆయన మాటిచ్చారు. "దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి, ఎప్పటిలాగే నన్ను ప్రోత్సహించండి" అని కోరడంతో ఈ వివాదానికి ప్రస్తుతానికి చెక్ పడినట్లయింది. ఒక సీనియర్ నటుడు తన తప్పును తెలుసుకొని వెంటనే స్పందించిన తీరును కొందరు అభినందిస్తుండగా, మరికొందరు మాత్రం బహిరంగ వేదికలపై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.లింక్






