- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ustad Bhagat Singh: కలిసొచ్చే అంశాలివే?
ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రంలో పవన్ ఇంట్రడక్షన్ సన్నివేశం, తొలిప్రేమ రీమిక్స్ సాంగ్, ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్, సెకండ్ హాఫ్ లో చైల్డ్ ఎపిసోడ్, దేకులేంగే సాలా సాంగ్ ప్లస్ పాయింట్లుగా తెలుస్తున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: ప్రతి సినిమాకు కొన్ని ప్లస్, మైనస్ పాయింట్లు ఉంటాయి. ఒక సినిమా విడుదల అయిన తర్వాత ప్లస్ పాయింట్లు ఎక్కువగా ఉండి మైనస్లు తక్కువగా ఉన్నట్లయితే అలాంటి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచి ప్రేక్షకాదరణ పొంది విజయాలను అందుకుంటాయి. అదే మైనస్ పాయింట్లు ప్రేక్షకులను ఎక్కువ ప్రభావితం చేస్తే అలాంటి చిత్రాలు ఫెయిల్యూర్ అవుతాయి. రేపు పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం విడుదల కానుంది. దీనితో ఇండస్ట్రీ వర్గాల నుండి ఈ సినిమాకు కలిసి వచ్చే అంశాలు ఇవి అని కొన్ని తెరపైకి వచ్చాయి. అవేంటో తెలుసుకుందాం.
ఈ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాలోని పవన్ ఇంట్రడక్షన్ సన్నివేశం కోసం చాలా కష్టపడినట్లు, అది అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తోంది. అలాగే ఈ చిత్రంలో తొలిప్రేమ మూవీకి సంబంధించిన ఓ పాటను రీమేక్ చేసినట్లు, అది కూడా జనాలను అద్భుతంగా ఆకట్టుకునే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. వీటితోపాటు ఇంటర్వెల్ యాక్షన్ బ్లాక్, సెకండ్ హాఫ్ లో వచ్చే చైల్డ్ ఎపిసోడ్, దేకులేంగే సాలా సాంగ్ కలిసి వచ్చే అంశాలని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇన్ని సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నట్లయితే ఈ చిత్రం కూడా జనాలను అలరిస్తుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ మూవీలో రాశి ఖన్నా, శ్రీలీల, పవన్ కి జోడీగా కనిపించబోతున్నారు. పార్థిబన్ విలన్ పాత్రలో నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్, తమన్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించారు






