బన్నీ-చరణ్ మల్టీస్టారర్ చిత్రానికి టైటిల్ ఫిక్స్.. 10 ఏళ్ల క్రితమే రిజిస్టర్ చేసిన అల్లు అరవింద్!

by Disha Web Desk 9 |
బన్నీ-చరణ్ మల్టీస్టారర్ చిత్రానికి టైటిల్ ఫిక్స్.. 10 ఏళ్ల క్రితమే రిజిస్టర్ చేసిన అల్లు అరవింద్!
X

దిశ, సినిమా: ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ ఊపందుకుంటుంది. పలువురు అగ్ర హీరోల కలయికలో ప్రాజెక్ట్స్ తెరకెక్కి.. ప్రేక్షకుల్లో మరింత జోరును పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే మరొక ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ కాంబినేషన్‌కు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో.. రామ్ చరణ్ - అల్లు అర్జున్ కలిసి ఒక సినిమాలో నటిస్తే చూడాలని ఉంది అని చెప్పుకొచ్చాడు.

దీంతో వీరిద్దరి కాంబోలో ఇప్పటికైనా మూవీ చేయాలన్న ఉద్దేశంతో అల్లు అరవింద్ ఏకంగా ఒక టైటిల్ కూడా రిజిస్టర్ చేసి పెట్టారట. పదేళ్ల క్రితమే ‘చరణ్ అర్జున్’ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నాడట. అందుకే ఈ టైటిల్ ను 10 సంవత్సరాల క్రితం రిజిస్టర్ చేసి పెట్టానని ప్రతి ఏడాది దీన్ని రెనివల్ చేస్తూ వస్తున్నానని అల్లు అరవింద్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక ఈ పాన్ ఇండియా స్టార్స్ కాంబినేషన్ లో సినిమా కనుక వస్తే బాక్సాఫీసు బద్దలవ్వాల్సిందే అంటూ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘వి ఆర్ వెయిటింగ ఫర్ బన్నీ అండ్ చరణ్ అన్న మల్టీస్టారర్ మూవీ’ అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు.

Read More..

CM జగన్‌తో అల్లు అర్జున్ వెయ్యికోట్ల ఒప్పందం.. కోపంతో రగిలిపోతున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్!


Next Story