'గంగుబాయి' పాత్ర నా జీవితాన్నే మార్చేసింది: Alia Bhatt

by Disha Web Desk 13 |
గంగుబాయి పాత్ర నా జీవితాన్నే మార్చేసింది: Alia Bhatt
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అలియా భట్ తను పోషించిన 'గంగూబాయి' పాత్ర గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'గంగుబాయి కతియావాడి'లో కామాటిపుర‌కు చెందిన వేశ్య పాత్రలో నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్న అలియా.. ఈ క్యారెక్టర్ నుంచి ఎన్నో సానుకూల విషయాలు నేర్చుకున్నానంటోంది. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి.. 'గంగుబాయికి నా నిజమైన వ్యక్తిత్వానికి కొన్ని పోలికలున్నాయి. ఆమె, నేను చిన్న వయస్సులోనే పని చేయడం ప్రారంభించాం. అయితే చెడు ప్రపంచం తో పోరాడుతున్న ధైర్యవంతురాలి పాత్ర పోషించినప్పటికీ.. నేను నా చిన్ననాటి అమాయకత్వాన్ని వీడలేకపోయా. మహిళల కోసం గంగూబాయి బలమైన వాయిస్ వినిపిస్తే.. నేను మాత్రం ఇప్పటికీ నా మనసులోని మాటను చెప్పడానికి భయాందోళన చెందుతాను. చిన్న వాళ్లతో పెద్దవాళ్లు ఏకీభవించేందుకు చోటు లేదని భావిస్తాను. కానీ, గంగుబాయి నాకు మాట్లాడటానికి ధైర్యాన్నిచ్చింది. చెప్పాల్సిన విషయాన్ని బలంగా వినిపించేందుకు విశ్వాసాన్ని ఇచ్చింది. ఈ పాత్ర ద్వారా నేను దృఢమైన మనస్తత్వం పెంపొందించుకున్నా. గంగుబాయి ఎంతో మందికి ఆదర్శవంతమైనదిగా నేను భావిస్తున్నా' అంటూ పలు విషయాలు ప్రస్తావించింది.

Read more:

'Kirstie Alley' ఇక లేరు.. క్యాన్సర్‌తో కన్నుమూసిన హాలీవుడ్ నటి


Next Story

Most Viewed