నెగెటివ్‌గా ఆలోచించేవాళ్లంటే చిరాకు : స్టార్ నటి

by Disha Web Desk 7 |
నెగెటివ్‌గా ఆలోచించేవాళ్లంటే చిరాకు : స్టార్ నటి
X

దిశ, సినిమా : యంగ్ బ్యూటీ అలియా భట్ 'బ్రహ్మాస్త్ర' రివ్యూస్‌పై మరోసారి స్పందించింది. సెప్టెంబర్ 9న విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు రాబడుతోంది. అయితే రీసెంట్ ఇంటర్వ్యూలో తమ సినిమాపై వస్తున్న నెగెటివ్ కామెంట్స్ ఉద్ధేశించి మాట్లాడి నటి.. తానెప్పుడూ సమీక్షల జోలికి వెళ్లనని, ఒకవేళ తనకు అనుకూలంగా రాసినప్పటికీ కూడా చదవనని స్పష్టం చేసింది.

అయితే కొన్నిసార్లు ఆర్టికల్స్‌లోని ముఖ్యాంశాలను మాత్రమే చూస్తానన్న అలియా.. సినిమా బాగుందా? లేదా? అనే విషయం తనకు ముందే తెలిసిపోతుందని, అందుకే రివ్యూలను పెద్దగా పట్టించుకోనని తెలిపింది. ఈ క్రమంలో తనను వ్యక్తిగతంగా కలిసినవాళ్లను మాత్రం ఫీడ్‌బ్యాక్ అడుగుతానని, సినిమా గురించి నెగెటివ్‌గా ఆలోచించడం నచ్చదని పేర్కొంది. ఇదిలా ఉంటే.. తన లేటెస్ట్ హాలీవుడ్ ఫిల్మ్ 'హార్ట్ ఆఫ్ స్టోన్' ఫస్ట్ లుక్‌ను అలియా నెట్టింట షేర్ చేయగా అభిమానులకు అట్రాక్ట్ చేస్తోంది.

Also Read : కంగనకు పోటీగా రాఖీసావంత్.. పొలిటికల్ హీట్ పెంచిన హేమ


Next Story

Most Viewed