కంగనకు పోటీగా రాఖీసావంత్.. పొలిటికల్ హీట్ పెంచిన హేమ

by Disha Web Desk 7 |
కంగనకు పోటీగా రాఖీసావంత్.. పొలిటికల్ హీట్ పెంచిన హేమ
X

దిశ, సినిమా : బాలీవుడ్‌ సీనియర్ నటి హేమమాలిని.. ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. ఇటీవల తమిళనాడు, మధురైలోని బాంకే బిహారీ ఆలయాన్ని కుటుంబంతో కలిసి సందర్శించిన కంగన.. మీడియాతో మాట్లాడుతూ భవిష్యత్‌లో రాజకీయాల్లోకి వస్తానని, మధురై నుంచే పోటీచేస్తానని చెప్పింది. కాగా పొలిటికల్ ఎంట్రీపై స్పందించిన కంగన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. ఈ క్రమంలో మధురైలోని అదే ఆలయాన్ని తాజాగా దర్శించుకున్న హేమమాలిని కంగన కామెట్స్‌పై స్పందించింది.

'ఆమె వ్యాఖ్యలపై నేనేం మాట్లాడలేను. శ్రీకృష్ణుడే అన్నీ చూసుకుంటాడు. ప్రజలకు ఇక్కడి వ్యక్తిని ఎన్నుకోవడం ఇష్టంలేకనే సినీ నటి కావాలనుకుంటున్నారేమో!. ఈ లెక్కన తర్వాత రాఖీ సావంత్ ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు' అని వెటకారంగా మాట్లాడింది. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా.. దీనిపై కంగన ఎలా విరుచుకుపడుతుందో చూడాలని తెగ వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.




Next Story

Most Viewed