- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాన్ ఇండియా మూవీకు సిద్ధమైన అక్కినేని హీరో..? పక్కా బ్లాక్ బస్టరే..!
యంగ్ హీరో అక్కినేని అఖిల్(Akhil Akkineni) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో అక్కినేని అఖిల్(Akhil Akkineni) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం ‘లెనిన్’(Lenin) మూవీతో బిజీగా ఉన్నాడు. మురళీ కిషోర్ అబ్బూరు(Murali Kishore Abburu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే(Bhagya Sree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ క్రమంలో అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
‘లెనిన్’ తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వ బృందంలోని సహాయక దర్శకుడితో కొత్త చిత్రానికి అఖిల్ ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ‘కెజిఎఫ్’, ‘సలార్’తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్ బృందంలో, ప్రముఖ సహాయ దర్శకుడు తెరకెక్కించబోయే చిత్రంలో అక్కినేని అఖిల్ హీరోగా నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు అంతిమ దశలో ఉన్నట్టు తెలుస్తోంది.
‘లెనిన్’ సినిమా తర్వాత అఖిల్ కెరీర్‌లో భారీ విజయం సాధించాలనే లక్ష్యంతో ఈ చిత్రాన్ని ఎంచుకుంటున్నారు. అయితే ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో తెరకెక్కనున్నదట. ప్రశాంత్ నీల్ శైలి ప్రభావం ఈ చిత్రంలోనూ కనిపిస్తుందని, ఈ చిత్రం మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే అవకాశం ఉందని సమాచారం. ఇక త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.
READ MORE ....
మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్..పెద్ది సినిమా వాయిదా..మళ్లీ రిలీజ్ ఎప్పుడంటే ?






