- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మెగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్..పెద్ది సినిమా వాయిదా..మళ్లీ రిలీజ్ ఎప్పుడంటే ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పెద్ద సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు.

దిశ, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పెద్ది. చాలా రోజుల నుంచి హిట్ కోసం ప్రయత్నం చేస్తున్న రామ్ చరణ్, ఈ సినిమా కోసం చాలా కష్టపడుతున్నారు. రంగస్థలం తరహాలోనే ఈ సినిమాను హిట్ చేసుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఈ మూవీకి సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. పెద్ది సినిమాలో రామ్ చరణ్ హీరోగా చేస్తుండగా, బాలీవుడ్ అందాల తార జాన్వీ కపూర్ హీరోయిన్ గా మెరువనున్నారు. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తోన్న ఈ సినిమా పాటలు కూడా అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇలాంటి నేపథ్యంలో పెద్ది సినిమా గురించి ఆసక్తికర న్యూస్ వైరల్ గా మారింది.
పెద్ది సినిమా వాయిదా ?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తున్న పెద్ద సినిమా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. మార్చి 27వ తేదీన రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను మే ఒకటో తేదీన విడుదల చేసేందుకు సిద్ధమవుతోందట చిత్ర బృందం. షూటింగ్ ఆలస్యం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. మే మొదటి వారంలో రిలీజ్ చేస్తే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయని చిత్ర బృందం భావించి.. ఇలా పోస్ట్ పోన్ చేస్తుందని మరి కొంతమంది అంటున్నారు.
READ MORE ....






