- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్కినేని హీరో క్రేజీ అప్‌డేట్స్.. అటు సినిమా, ఇటు వెబ్ సిరీస్‌తో పక్కా స్కెచ్!
వృషకర్మ షూటింగ్ ఇప్పటికే 85 శాతం పూర్తయింది. కేవలం 15 శాతం మాత్రమే మిగిలి ఉంది.

దిశ, సినిమా: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. 2025లో ‘తండేల్’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న చైతు, ఇప్పుడు అదే ఉత్సాహంతో వరుస ప్రాజెక్టులను పట్టాలెక్కిస్తున్నారు. తాజాగా, ఆయన తన రాబోయే చిత్రాల గురించి ఆసక్తికరమైన అప్‌డేట్స్ పంచుకున్నారు. మ్యాజికల్ థ్రిల్లర్ ‘విరూపాక్ష’తో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు కార్తీక్ దండు దర్శకత్వంలో చైతన్య ‘వృషకర్మ’ అనే భారీ బడ్జెట్ చిత్రంలో నటిస్తున్నారు. SVCC బ్యానర్‌పై భోగవల్లి బాపినీడు నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో చైతు మాట్లాడుతూ.. "వృషకర్మ షూటింగ్ ఇప్పటికే 85 శాతం పూర్తయింది. కేవలం 15 శాతం మాత్రమే మిగిలి ఉంది.
ఈ సినిమా కథ చాలా కొత్తగా, వినూత్యంగా ఉంటుంది" అని తెలిపారు. ఇందులో చైతు సరసన అందాల భామ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది. చైతన్య తన ఓటీటీ అరంగేట్రం చేసిన ‘ధూత’ వెబ్ సిరీస్ ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ సూపర్ హిట్ సిరీస్‌కు సీక్వెల్ ధూత-2 రాబోతోంది. విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలోనే తెరకెక్కనున్న ఈ ప్రాజెక్ట్ గురించి చైతు క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ సిరీస్‌కు సంబంధించిన స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని ఆయన పేర్కొన్నారు. వరుస సక్సెస్‌లతో జోరు మీదున్న చైతన్య, అటు వెండితెరపై ‘వృషకర్మ’తో, ఇటు ఓటీటీలో ‘ధూత-2’తో ప్రేక్షకులను మరోసారి థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. విలక్షణమైన కథలను ఎంచుకుంటూ చైతు సాగిస్తున్న ఈ ప్రయాణం అక్కినేని అభిమానులకు ఫుల్ జోష్ ఇస్తోంది.






