రక్తంతో తడిసిన చదరంగం.. కొత్త సినిమా పోస్టర్‌తోనే అంచనాలు పెంచేసిన సందీప్ కిషన్

by Mallepaka Hamsa |   (  Updated:2026-04-16 07:00:28  IST  )

రక్తంతో తడిసిన చదరంగం బోర్డు, విరిగిపోయిన పావులు, వాటి మధ్య నలిగిపోయిన ఒక రోజా పువ్వు.. ఇవన్నీ చూస్తుంటే సినిమా చాలా ఇంటెన్స్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది.

రక్తంతో తడిసిన చదరంగం.. కొత్త సినిమా పోస్టర్‌తోనే అంచనాలు పెంచేసిన సందీప్ కిషన్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో తనదైన శైలిలో వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతున్న యంగ్ హీరో సందీప్ కిషన్, చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 16 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన, ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని తన తదుపరి భారీ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. సందీప్ కిషన్ కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ‘పవర్ పేట’ అనే మాస్ టైటిల్‌ను ఖరారు చేశారు. ‘యాత్ర’, ‘ఆనందో బ్రహ్మ’ వంటి సూపర్ హిట్ చిత్రాలను నిర్మించిన విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి తమ 70mm ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘రౌడీ ఫెలో’ వంటి చిత్రాలతో తన మార్క్ చూపించిన దర్శకుడు కృష్ణ చైతన్య, ఈ సినిమా కోసం ఒక అద్భుతమైన ‘రా అండ్ రస్టిక్’ స్క్రిప్ట్‌ను సిద్ధం చేశారు. సినిమా ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్ నెటిజన్లను విశేషంగా ఆకర్షిస్తోంది.

రక్తంతో తడిసిన చదరంగం బోర్డు, విరిగిపోయిన పావులు, వాటి మధ్య నలిగిపోయిన ఒక రోజా పువ్వు.. ఇవన్నీ చూస్తుంటే సినిమా చాలా ఇంటెన్స్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. "ప్రేమ, గౌరవం, రాజకీయాలు" (Love, Honour, Politics) అనే ట్యాగ్‌లైన్ ఈ కథలోని ప్రధాన ఇతివృత్తాన్ని స్పష్టం చేస్తోంది. అధికార దాహం, ఎత్తుగడలు , త్యాగాల చుట్టూ ఈ కథ తిరుగుతుందని పోస్టర్ హింట్ ఇస్తోంది.ఈ సందర్భంగా సందీప్ కిషన్ సోషల్ మీడియా వేదికగా ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశారు. "16 ఏళ్ల నా సినిమా ప్రస్థానంలో మీ ప్రేమ, నా శ్రమ, నా పట్టుదలే నన్ను ఇక్కడి వరకు నడిపించాయి. ప్రతి అడుగులో నాకు పాఠాలు నేర్పిన వారందరికీ, నాపై ప్రేమ కురిపించిన ప్రేక్షకులకు నేను ఎంతో కృతజ్ఞుడిని. ఇప్పుడు నా తదుపరి ప్రతిష్టాత్మక అధ్యాయం ‘పవర్ పేట’కు మీ అందరి ఆశీస్సులు కావాలి" అని రాసుకొచ్చారు.ఈ సినిమా కోసం సందీప్ కిషన్ మునుపెన్నడూ చూడని రీతిలో భారీ మేకోవర్ అవ్వబోతున్నారు. తన 16 ఏళ్ల అనుభవాన్ని రంగరించి ఈ ‘పవర్ పేట’తో సందీప్ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారో వేచి చూడాలి.

అక్కినేని హీరో క్రేజీ అప్‌డేట్స్.. అటు సినిమా, ఇటు వెబ్ సిరీస్‌తో పక్కా స్కెచ్!

Next Story