2 ఏళ్ళ తర్వాత అక్కినేని హీరో బిగ్ అనౌన్స్ మెంట్..?

by velandi.Saikiran |   (  Updated:2025-04-07 06:29:48  IST  )

అక్కినేని (Akkineni ) కాంపౌండ్ నుంచి.. మరో కొత్త సినిమా రాబోతోంది. డిజాస్టర్ హీరోగా మారిన అక్కినేని అఖిల్ ( Akkineni

2 ఏళ్ళ తర్వాత అక్కినేని హీరో బిగ్ అనౌన్స్ మెంట్..?
X

దిశ, వెబ్ డెస్క్: అక్కినేని (Akkineni ) కాంపౌండ్ నుంచి.. మరో కొత్త సినిమా రాబోతోంది. డిజాస్టర్ హీరోగా మారిన అక్కినేని అఖిల్ ( Akkineni Akhil)... సరికొత్త సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు... సిద్ధమవుతున్నాడు. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కొత్త ప్రాజెక్టు అనౌన్స్ చేయబోతున్నాడు అక్కినేని అఖిల్. ఈ మేరకు టాలీవుడ్ ( Tollywood) సర్కిల్స్ లో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. హీరో అక్కినేని అఖిల్... కొత్త సినిమా అనౌన్స్మెంట్.. ఏప్రిల్ 8 అంటే రేపు ఉంటుందని.. సమాచారం అందుతోంది. రేపే టైటిల్ గ్లింప్స్ కూడా రిలీజ్ చేయబోతున్నారట. ఈ సినిమాకు మురళీ కిషోర్ (Murali Kishore) దర్శకత్వం వహించబోతున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను సితార వంశీ నిర్మించబోతున్నారు. అలాగే ఈ సినిమాకు లెనిన్ ( Lenin) అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్త వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాతో పాటు... యువి క్రియేషన్స్ ఆధ్వర్యంలో మరో సినిమా కూడా అఖిల్ చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా కొత్త దర్శకుడు అనిల్... తీయనున్నాడు. ఈ సినిమా ప్రకటన కూడా రేపే రాబోతున్నట్లు సమాచారం అందుతుంది. అంటే రేపు రెండు సినిమాల అనౌన్స్ మెంట్ ఉండబోతుందని తెలుస్తోంది. ఏజెంట్ మూవీ ( Agent) డిజాస్టర్ తర్వాత.. ఎలాగైనా హిట్టు కొట్టాలని... అక్కినేని అఖిల్.. చాలా కష్టపడుతున్నారట. కథ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారట అక్కినేని అఖిల్. ఈ విషయంలో తన కుటుంబం సలహాలు కూడా తీసుకుంటున్నట్లు సమాచారం అందుతుంది. ఇలాంటి నేపథ్యంలోనే రేపు బిగ్ అనౌన్స్మెంట్ రానుంది.


Read More..

బిగ్ బాస్ సీజ‌న్‌కి కొత్త హోస్ట్‌గా బాలయ్య ..?

Next Story