బిగ్ బాస్ సీజ‌న్‌కి కొత్త హోస్ట్‌గా బాలయ్య ..?

by Naveena |   (  Updated:2025-04-07 06:28:08  IST  )

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ప్రేక్ష‌కుల‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే.

బిగ్ బాస్ సీజ‌న్‌కి కొత్త హోస్ట్‌గా బాలయ్య ..?
X

దిశ, వెబ్ డెస్క్ : బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ప్రేక్ష‌కుల‌లో మంచి ఫాలోయింగ్ ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టివ‌ర‌కు 8 సీజ‌న్‌లు కంప్లీట్ చేసుకున్న ఈ షో 9వ సీజ‌న్‌కి సిద్ధమ‌వుతుంది. అయితే బిగ్ బాస్ మేకర్స్ నుంచి కొత్త టాక్ వినిపిస్తోంది. 9వ సీజ‌న్ మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా ఉండడానికి హోస్ట్ ను మార్చే ఆలోచనల్లో పడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. బిగ్ బాస్ తెలుగుకి కొత్త హోస్ట్ రాబోతున్న‌ట్లు ..ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వార్త‌లు వైర‌ల్‌గా మారాయి.ఇప్ప‌టికే వ‌చ్చిన 8 సీజ‌న‌ల‌లో మొద‌టి సీజ‌న్‌కి అగ్ర క‌థానాయ‌కుడు ఎన్టీఆర్ హోస్ట్ చేశారు. ఆ త‌ర్వాత వ‌చ్చిన సెకండ్ సీజ‌న్‌కి నాని ఓ పట్టు పట్టాడు. ఇక మూడ‌వ సీజ‌న్ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు స‌క్సెస్‌ఫుల్ హోస్ట్‌గా కింగ్ నాగార్జున రాణిస్తున్నారు .

అయితే తాజాగా వ‌చ్చే కొత్త సీజ‌న్‌కి టాలీవుడ్ స్టార్ హీరో నందమూరి బాలయ్య హోస్ట్‌గా చేయ‌బోతున్న‌ట్లు వార్తలు వస్తున్నాయి. కింగ్ నాగార్జున స్థానంలో హోస్ట్ గా చేయాలని బాలయ్యను నిర్వాహకులు సంప్రదించారని టాక్ నడుస్తోంది. 'అన్స్టాపబుల్'తో బాలయ్య బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ కు బాలయ్య ప్లస్ అవుతారని వారు భావిస్తున్నట్లు సమాచారం. అలాగే అటు రానా దగ్గుబాటి పేరు కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించిన వార్త‌లు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. దీనిపై బిగ్ బాస్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.బిగ్ బాస్ సీజ‌న్‌కి కొత్త హోస్ట్‌గా బాలయ్య ..?

Read More..

నన్ను ఎప్పుడు వెంటాడే ఎమోషన్ అంటూ అతనితో ఉన్న క్యూట్ ఫొటో షేర్ చేసిన ఎన్టీఆర్.. మీకాంబోలో మరో సినిమా కావాలంటూ ...

Next Story