నయనతారను స్ఫూర్తిగా తీసుకున్నా.. అది నా జీవితాన్ని మలుపు తిప్పిందంటూ ఐశ్వర్య ఆసక్తికర కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-09 03:41:36  IST  )

నటనపై ఆసక్తితో ఎంతోమంది యువత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంటారు

నయనతారను స్ఫూర్తిగా తీసుకున్నా.. అది నా జీవితాన్ని మలుపు తిప్పిందంటూ ఐశ్వర్య ఆసక్తికర కామెంట్స్
X

దిశ, సినిమా: నటనపై ఆసక్తితో ఎంతోమంది యువత సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తుంటారు. కొందరు మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టి స్టార్‌డమ్‌ను అందుకుంటే.. మరికొందరు మాత్రం అవకాశాల కోసం సంవత్సరాల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది. ప్రతిభ ఉన్నా సరైన బ్రేక్ రాక అడపా దడపా సినిమాలతో సరిపెట్టుకునే పరిస్థితులు కూడా ఇండస్ట్రీలో కొత్తేమీ కాదు. ఈ క్రమంలో తాజాగా ఓ యువ నటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. ఆ నటి మరెవరో కాదు ఐశ్వర్య(Aishwarya). తాను నటన వైపు రావడానికి ప్రధాన స్ఫూర్తి నయనతారేనని ఐశ్వర్య ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

సాధారణ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి, కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నయనతార(Nayanthara) జర్నీ తనను బాగా ప్రభావితం చేసిందని చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గా మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ ‘లేడీ సూపర్ స్టార్’ స్థాయికి చేరిన తీరు తనకు ఎంతో ప్రేరణనిచ్చిందని ఐశ్వర్య తెలిపింది. కోవిడ్ సమయంలో తాను చేసిన ఓ షార్ట్ ఫిలిం తన జీవితాన్నే మలుపు తిప్పిందని చెప్పుకొచ్చింది. ఈసమయంలోనే ‘జస్టిస్ ఫర్ జెనీలో’’ లొ నటించూ అవకాశం వచ్చింది. ప్రస్తుతం నటరాజ్‌కు జోడీగా నటించనున్నట్లు వెల్లడించింది.

Read More..

హీరోయిన్ శ్రీలీలకు ఘోర అవ‌మానం..బీకామ్ కంప్యూట‌ర్స్ లాగానే?

Next Story