- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్ శ్రీలీలకు ఘోర అవమానం..బీకామ్ కంప్యూటర్స్ లాగానే?
కేరళ ఆర్ట్స్ కాలేజీకి శ్రీ లీలతో పాటు చిత్ర బృందం వెళ్ళింది. ఈ సందర్భంగా శ్రీలీల చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఆర్ట్స్ కాలేజీకి వెళ్లి ఎంత మంది డాక్టర్లు ఇక్కడ ఉన్నారని కామెంట్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీలీల ( Sreeleela), తమిళ హీరో శివ కార్తికేయన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ పరాశక్తి. ఈ సినిమా సంక్రాంతి బరిలో రెండు భాషల్లో రిలీజ్ కానుంది. తమిళ్ తో పాటు తెలుగులో కూడా విడుదల అయ్యేందుకు సిద్ధమైంది. జనవరి 10వ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. సుధా కొంగర దర్శకత్వంలో వచ్చిన ఈ పిరియాడిక్ పొలిటికల్ డ్రామా హిందీ వ్యతిరేక ఉద్యమాల నేపథ్యంలో వస్తోందట.
హీరోయిన్ శ్రీలీలకు అవమానం
పరాశక్తి మూవీ రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఇందులో భాగంగానే ఓ కేరళ ఆర్ట్స్ కాలేజీకి శ్రీ లీలతో పాటు చిత్ర బృందం వెళ్ళింది. ఈ సందర్భంగా శ్రీలీల చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి. ఆర్ట్స్ కాలేజీకి వెళ్లి ఎంత మంది డాక్టర్లు ఇక్కడ ఉన్నారని కామెంట్ చేసింది. దీంతో అక్కడ ఉన్న వాళ్లంతా ఆమెను చూస్తూ పగలబడి నవ్వారు. ఆ తర్వాత విషయం అర్థం చేసుకున్న శ్రీలీల ( Sreeleela), ఆర్ట్స్ కాలేజీ అని మర్చిపోయినట్లు క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. కాగా తమిళ హీరో శివ కార్తికేయన్ చేసిన ఈ సినిమా తెలుగులో వాయిదా పడే ఛాన్స్ ఉన్నట్లు టాక్. థియేటర్లు దొరకకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారట. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. క్లిక్






