Salaar : ఆ స్టార్ హీరో‌ వదులుకున్నాకే.. ప్రభాస్ వద్దకు ‘సలార్’ స్టోరీ!

by Disha Web Desk 9 |
Salaar : ఆ స్టార్ హీరో‌ వదులుకున్నాకే.. ప్రభాస్ వద్దకు ‘సలార్’ స్టోరీ!
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ‘ప్రభాస్’.. ‘ప్రశాంత్ నీల్’ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘సలార్’. కాగా, ఇవాళ(జులై 6న) ఉదయం 5:15 గంటలకు చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రభాస్ మాస్‌ లుక్‌లో ఉన్న ఈ టీజర్‌ను ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఓ వైపు ఈ మూవీ సూపర్ డూపర్ హిట్ అవుతుందని.. బొమ్మ బ్లాక్ బస్టర్ పక్క అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రేక్షకులు ఈ చిత్రంపై భారీ అంచనాలే పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ చిత్రంలో ప్రభాస్ కాకుండా మరో హీరోని సెలక్ట్ చేశారట దర్శక నిర్మాతలు. ఈ హీరో మరెవరో కాదు పుష్ప మూవీతో ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ దక్కించుకున్న ఐకాన్ స్టార్ ‘అల్లు అర్జున్’. సలార్ సినిమా కథని ప్రశాంత్ నీల్.. బన్నీకి వివరించగా.. పుష్ప మూవీలా ఇది కూడా మాస్ కంటెంట్ కావడంతో బ్యాక్ టు బ్యాక్ మాస్ కంటెంట్ చిత్రాల్లో నటిస్తే ఇమేజ్ డ్యామేజ్ అవుతుందన్న భయం కారణంగా బన్నీ ఈ సినిమాను వద్దన్నాడట. ఇక నీల్ ఫైనల్లీ ప్రభాస్‌ను ఓకే చేశారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

Read more : Prabhas Salaar Teaser : టీజర్‌కు ప్రేక్షకుల్లో రెస్పాన్స్ ఎలా ఉందంటే? (వీడియో)

అక్కడ.. అలా కనిపించిన Sai Pallavi

Next Story

Most Viewed