- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Dacoit : అడివి శేష్ ‘డెకాయిట్’ వేట షురూ.. ట్రైలర్ విడుదల తేదీ ఫిక్స్
విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్‌ను అడివి శేష్ స్వయంగా ప్రకటించారు.

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘డెకాయిట్’. వైవిధ్యమైన కథాంశంతో దర్శకుడు షానిల్ డియో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అడివి శేష్ సరసన అందాల నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పక్కా రివెంజ్ డ్రామాగా, రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ అంశాలతో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని, ఏప్రిల్ 10న థియేటర్లలోకి రావడానికి సిద్ధమైంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. తాజాగా, ఈ సినిమా ట్రైలర్ అప్‌డేట్‌ను అడివి శేష్ స్వయంగా ప్రకటించారు. ఏప్రిల్ 4న ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించబోతుండటం విశేషం.
ఇక ఈ సినిమా షూటింగ్ అనుభవాల గురించి అడివి శేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ముఖ్యంగా క్లైమాక్స్ సీన్లను సుమారు 45 డిగ్రీల మండే ఎండలో ఒక పర్వతంపై చిత్రీకరించాం. ఆ వేడిలో యాక్షన్ సీక్వెన్స్ చేయడం చాలా సవాలుగా అనిపించింది. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా విజువల్స్ పరంగా కూడా ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుంది" అని ఆయన పేర్కొన్నారు. తరచుగా థ్రిల్లర్ జోనర్ సినిమాలే చేస్తున్నారన్న విమర్శలకు సమాధానమిస్తూ.. "డెకాయిట్ మూవీతోనే ఆ మార్పు మొదలవుతుంది. ఇది కేవలం యాక్షన్ చిత్రం మాత్రమే కాదు, ఒక అందమైన రొమాంటిక్ ఎమోషనల్ జర్నీ" అని శేష్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా అడివి శేష్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.






