సెన్సార్ పూర్తి చేసుకున్న డెకాయిట్‌

by Pulgam srinivas |   (  Updated:2026-04-02 13:11:56  IST  )

డెకాయిట్ చిత్రానికి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు.

సెన్సార్ పూర్తి చేసుకున్న డెకాయిట్‌
X

దిశ, వెబ్ డెస్క్: వరుస విజయాలతో మంచి జోష్‌లో కెరీర్‌ను ముందుకు తీసుకెళ్తున్న హీరో అడవి శేష్ తాజాగా ‘డెకాయిట్’ చిత్రంలో హీరోగా నటించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించగా, ప్రముఖ దర్శకుడు అనురాగ్ కశ్యప్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. సినిమా విడుదల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, చిత్రబృందం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసింది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి U/A సర్టిఫికెట్ జారీ చేసినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ఈ చిత్రానికి షానీల్ డియో దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.

Dacoit : అడివి శేష్ ‘డెకాయిట్’ వేట షురూ.. ట్రైలర్ విడుదల తేదీ ఫిక్స్

Next Story