బ్యాడ్ రిలేషన్‌షిప్‌తో మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యా: Aaliyah Kashyap

by Disha Web Desk 7 |
బ్యాడ్ రిలేషన్‌షిప్‌తో మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యా: Aaliyah Kashyap
X

దిశ, సినిమా : అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్ తానెదుర్కొన్న బ్యాడ్ రిలేషన్ గురించి ఓపెన్ అయింది. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టకుండానే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న ఈ బ్యూటీ.. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, ప్రముఖ యూట్యూబర్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే తన 'గర్ల్ టాక్ Pt 5' యూట్యూబ్ చానెల్‌లో పర్సనల్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్న ఆమె.. కొంతకాలంపాటు విషపూరిత సంబంధంలో ఉన్నట్లు గుర్తుచేసుకుంది.

'నేను దేనిగురించి అబద్ధం చెప్పను. ప్రత్యేకించి చెడు బంధాల గురించి. మనతో పెనవేసుకుపోయిన రిలేషన్స్‌ను వదులుకోవడం అంత తేలికైన విషయం కాదు. అయినప్పటికీ మనకు సహాయపడని స్నేహితులను వదులుకోవడమే బెటర్. కొంతకాలంగా నాతో ఏకీభవించేవాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నా. ముఖ్యంగా రిలేషన్‌షిప్ కన్నా నా మనసుకే ప్రియారిటీ ఇస్తున్నా. అదే నాకు అన్ని విధాల సాయపడుతోంది. మీరు కూడా అలాగే చేయండి. అది మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది' అంటూ చెప్పుకొచ్చింది.

Also Read :స్టార్ కిడ్స్ మొత్తం డ్రగ్స్ బానిసలే.. నడిరోడ్డుపై దొరికిన ఖుషీ, నీసా



Next Story

Most Viewed