బాయ్ ఫ్రెండ్‌తోనే ఎంగేజ్‌మెంట్.. సడెన్‌గా షాక్ ఇచ్చిన నిర్మాత కూతురు

by Kodari Anjali |   (  Updated:2023-05-21 07:20:18  IST  )

ఇండియన్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది.

బాయ్ ఫ్రెండ్‌తోనే ఎంగేజ్‌మెంట్.. సడెన్‌గా షాక్ ఇచ్చిన నిర్మాత కూతురు
X

దిశ, సినిమా: ఇండియన్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కుమార్తె ఆలియా కశ్యప్ తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. కొంతకాలంగా అమెరికన్ ప్రియుడు షేన్ గ్రెగోయిర్‌తో డేటింగ్ చేస్తున్న ఆమె.. తాజాగా అతనితో నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు 22 ఏళ్ల వయసున్న ఆలియా తమ ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. ‘సో.. ఇలా జరిగింది. మై బెస్ట్ ఫ్రెండ్. మై పార్ట్‌నర్. మై సోల్ మేట్. ఇపుడు నా ఫియాన్సీ. లవ్ ఆఫ్ మై లైఫ్. నిజమైన & షరతులు లేని ప్రేమ ఎలా ఉంటుందో నాకు చూపించినందుకు ధన్యవాదాలు. నా జీవితం మొత్తం నీతో గడపడానికి వేచి ఉండలేను. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. నేను నిన్ను AAHHHH అని పిలుస్తానని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చిన బ్యూటీ ప్రియుడితో ఆనందంలో మునిగితేలుతోంది.

Also Read.: లివ్ ఇన్ రిలేషన్ మాకు కొత్తదేమీ కాదు.. పవిత్రతో పెళ్లిపై స్పందించిన నరేష్


Next Story